Secrets of Teacher Satisfaction: ఒక వ్యక్తి ఎదుగుదలకు తల్లిదండ్రులతోపాటు గురువుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ఇంట్లో చెప్పే విషయాల కన్నా పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే విద్యాబుద్ధులే జీవితాన్ని మారుస్తాయి. అందుకే ఒక వ్యక్తి నీ మార్చడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు తమ బోధనల ద్వారా ఎంత మంది విద్యార్థులు ప్రయోజకులు అయ్యారో తెలుసుకొని ఎక్కువగా సంతోషిస్తారు. అయితే కొందరు ఉపాధ్యాయులకు తమకు వచ్చే జీతం కన్నా.. సంతృప్తి ఎక్కడ లభిస్తుందో తెలుసా?
నేటి కాలంలో డబ్బు లేనిదే ఏ పని ముందుకు సాగదు. ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం తీసుకునే డబ్బుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనులు చేస్తుంటారు. అంటే కొందరు లక్షల జీతం పొందుతున్న సరైన విధంగా విధులు నిర్వహించలేరు. మరికొందరు మాత్రం తక్కువ జీవితం తీసుకుంటున్న వారి పనిని సక్రమంగా నిర్వహిస్తారు.
అయితే మిగతా వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది అని భావిస్తారు. ఎందుకంటే ఉపాధ్యాయుల వల్ల సమాజం బాగుపడుతుంది. ఉపాధ్యాయులు సరైన బోధన చేస్తే ఎంతోమంది ప్రయోజకులుగా మారుతారు. ఒక వ్యక్తి ఎదగడానికి ఉపాధ్యాయుడు నిబద్ధతతో పనిచేస్తాడు. ఈ క్రమంలో తన జీతం కోసం కాకుండా ఎదుటి వ్యక్తి ఎదుగుదల కోసమే అన్నట్లుగా విధులు నిర్వహిస్తారు. ఇలాంటి సమయంలో ఒక ఉపాధ్యాయుడు ఎక్కువగా సంతృప్తి పొందేది జీతం వద్ద కాదు. తాము ఆరోజు ఎలాంటి బోధన చేశాము? దానివల్ల ఎంతమందికి ప్రయోజనం కలిగింది? అన్న విషయాలే సంతృప్తినిస్తాయి.
Also Read: రూ.10 వేల జీతం కంటే రూ.10 లక్షల జీతం వస్తే జీవితం ఎలా ఉంటుందంటే?
అయితే విద్యార్థులు సైతం ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తూ ఉండాలి. వారు చెప్పిన ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం నేర్చుకునే వయసులో ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. కానీ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం వీరు కనిపించరు. అందువల్ల అందుబాటులో ఉన్నప్పుడే అన్ని విషయాలు నేర్చుకోవాలి. ఉపాధ్యాయులకు ఎంత గౌరవం ఇస్తే.. అన్ని కొత్త విషయాలు తెలుస్తాయి.
ఒకప్పుడు ఉపాధ్యాయులకు జీతాలు చాలా తక్కువగా ఉండేవి. అయినా కూడా వారు తమకు వచ్చే ఆదాయాన్ని పట్టించుకోకుండా చదువు చెప్పాలని ఎంతో అనుకునేవారు. అయితే ఏ కాలంలో చదువుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు చదువుకోవాలని అనుకుంటున్నా.. కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం సరైన విధంగా బోధించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరి కొంతమంది మాత్రం జీతం కోసం కాకుండా ఎదుటివారిని ప్రయోజకులుగా చేయాలని ఉద్దేశంతోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల చాలామంది జీవితంలో సక్సెస్ను సాధించారు. అంతేకాకుండా ఒక మంచి ఉపాధ్యాయుడు వలన సమాజం బాగుపడుతుంది. అతడు చెప్పే బోధనలు ఒక వ్యక్తి జీవితమే మారిపోతుంది.