Healthy Diet: మన వంటింట్లో ఉండే వాటిల్లో చాలా వరకు మనకు ఉపయోగపడేవి ఉంటాయి. ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ముఖ్యమైనవి. ఇవి మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి. దీంతో మన అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. వైద్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. మన జీవితంలో నిత్యం ఉపయోగించే కొత్తిమీర, పుదీనా, కరివేపాకుతో మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. మనకు కలిగే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. వీటి వినియోగంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. పప్పులో వేసే కరివేపాకును ఉడికిన తరువాత తీసి పారేస్తారు. కూరల్లో వేసే కొత్తిమీర, పుదీనాను పక్కన పెడతారు.

మనం కూరల్లో వాడుకునే పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల మన ఆరోగ్య రక్షణ ముడిపడి ఉంటుంది. పుదీనాతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పుదీనా వాడకంతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పుదీనా ఆకులను గ్లాసు నీటిలో మరిగించి ఆ కాషాయాన్ని తాగితే జ్వరంతో పాటు కామెర్లు, చాతీ మంట, కడుపులో మంట, మూత్ర సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి. దగ్గు, జలుబు దూరం అవుతాయి. పుదీనా పచ్చడితో పిల్లల్లో ఆకలిని పెంచుతుంది. అజీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. పుదీనా వాడకంలో చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది.
కూరల్లో వేసుకునే కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కరివేపాకుతో ఉన్న ఔషధాల నేపథ్యంలో దాన్ని పక్కన పెట్టడం సముచితం కాదు. ఉదయాన్నే పరగడుపున కరివేపాకు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. కరివేపాకు కూరలకు రుచి తెస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తుంది. కాలేయ సమస్యలు ఉన్న వారు నిత్యం తీసుకుంటే ఎంతో ప్రయోజనం. కరివేపాకుతో రక్తహీనత తగ్గుతుంది. కరివేపాకు బరువు తగ్గడంలో సాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారుతుంది. కరివేపాకుతో కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కొవ్వును నియంత్రిస్తుంది.

కొత్తిమీర వల్ల కూడా మనకు పలు విధాలుగా లాభాలున్నాయి. నిత్యం కొత్తిమీర తీసుకుంటే ఎసిడిటి సమస్య తగ్గుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిరోధిస్తుంది. శ్వాసనాళాల్లో ఉన్న కఫాన్ని బయటకు తీసుకువస్తుంది. కొత్తిమీర కడుపునొప్పి సమస్యను దూరం చేస్తుంది. కొత్తిమీరతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే ఫుడ్ పాయిజన్ వల్ల కడుపులో తయారైన చెడు బ్యాక్టీరియాను నిర్వీర్యం చేస్తుంది. నోటి దుర్వాసన తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తుంది. ఎముకలు దృఢంగా కావడానికి దోహదపడుతుంది.