Vastu Tips: మన ఇల్లు వాస్తు దోషం లేకుండా చూసుకోవాలి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. వాస్తు నియమాలు జాగ్రత్తగా పాటిస్తే వాస్తు దోషాలు లేకుండా ఉంటాయి. దీంతో ఇల్లు మంచి సౌభాగ్యాలకు నిలయం అవుతుంది. ఇంటిని చక్కగా అమర్చుకుంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. వాస్తు పద్ధతుల ప్రకారం వీటిని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ప్రతి ఇంట్లో పూజా మందిరం సరైన దిశలో లేకుంటే నష్టాలే వస్తాయి. ఈశాన్య దిశలో పూజా గది ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉత్తమం. వాస్తు దోషం ఉంటే ఇంటి పురోగతి నిలిచిపోతుంది. ఇల్లు ఐశ్వర్యంగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు కలుగుతుంది.

ఇంటి ప్రధాన ద్వారం ముందు పచ్చని కుండీలు పెట్టుకుంటే మంచిది. గుమ్మం వద్ద మొక్కను నాటి అది ఎండిపోకుండా చూసుకుంటే మన ఇంటికి సకల సౌభాగ్యాలు వచ్చి చేరుతాయి. కుండీలో మొక్కలు నాటి అవి ఎండిపోకుండా చూసుకోవలి. పచ్చదనమే మనకు శ్రీరామరక్ష. మొక్కలు ఎండిపోతే పేదరికం ఆవహిస్తుంది. అందుకే ఇంటికి పలు జాగ్రత్తలు తీసుకుని వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే ఫలితం ఉంటుంది. దీంతో మన ఇల్లు ఓ నందనవనం కావడం ఖాయం.
వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా మంచం నైరుతి దిశలో ఉంచుకోవాలి. కాళ్లు ఉత్తరం వైపు పెట్టుకుని పడుకుంటే మంచిది. లేదంటే తూర్పు వైపు కాళ్లు చాపుకోవాలి. అపసవ్య దిశలో పడుకుంటే మనకే అరిష్టం. నిద్ర పోయే సమయంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. వాటిని పట్టించుకోవాలి. వాస్తు నియమాల ప్రకారం బెడ్ రూంను అలంకరించుకుంటే మనకు ఎలాంటి దోషాలు లేకుండా ఉంటాయి. దీనికి అందరు కొన్ని జాగ్రత్తలు తీసుకుని బెడ్ రూంను ఓ మంచి స్వర్గధామంగా భావించుకోవాలి.

ఇంటి వాస్తు శాస్త్రం ప్రకారం ఏ వస్తువు ఎక్కడ ఉంచుకోవాలో అక్కడే ఉంచుకుంటే ప్రయోజనం. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు తెరిచే ఉంచాలి. లేదంటే మన ఇంటికి గ్రహదోషం పట్టుకుంటుంది. ఇంట్లో నీటి సదుపాయం కూడా సరిగా ఉండేలా అమర్చుకోవాలి. ఎక్కడ కూడా నీటి లీకేజీలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మన ఇంటికే శని పట్టుకుంటుంది. ఇంట్లో ఆనందాలు నిలవాలంటే వాస్తు నియమాలు పాటించి మనకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.