Life: కొందరు తమ జీవితంలో ఎంతో ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తారు. మరికొందరు తమ జీవితం వృధాగా గడిచిపోతుందని ఎలాంటి ఎంజాయ్మెంట్ లేదని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి ఎంజాయ్మెంట్ అనగానే చాలామంది అనుకునేది ఏంటంటే.. ఫ్రెండ్స్ తో తిరగడం.. విహారయాత్రలకు వెళ్లడం.. వీలైతే పార్టీలు చేసుకోవడం.. వంటివి ఎంజాయ్మెంట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ జీవితంలో అసలైన ఎంజాయ్మెంట్ అనేది ఇది కాదు అని చాలామంది సైక్రియాసిస్టులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వారి వద్దకు వచ్చిన సమస్యలను బట్టి వారి చెబుతున్న అసలైన ఎంజాయ్మెంట్ ఏంటంటే?
ఒక వ్యక్తికి అపారమైన ధనం ఉంది.. అతను తన స్నేహితులతో ఎప్పుడు పార్టీలు చేసుకుంటూ కాలం గడిపేవాడు. కానీ ఒకరోజు తనకు ఓ సమస్య వచ్చింది. దానిని చెప్పడానికి తన స్నేహితులను పిలిచాడు. కానీ పార్టీలు అనగానే వచ్చిన స్నేహితులు సమస్యలు అనగానే ఎవరు రాలేకపోయారు. తన కుటుంబంలో కూడా తన సమస్య వినడానికి ఎవరు పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఇక కొందరైతే ఇతనికి వచ్చిన సమస్యను చూసి హేళన చేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా ఆలోచించి తన దగ్గర ఎంతో డబ్బు ఉంది.. ఎంతోమంది బంధువులు, స్నేహితులు ఉన్నారు. కానీ మనశ్శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నాను? అని ఆలోచించ సాగాడు. అయితే కొన్ని రోజుల తర్వాత తనకు ఒక మహిళా పరిచయం అయింది. తాను బాధపడుతున్న తీరును చూసి సమస్యను తెలుసుకుంది. ఆ సమస్యను విన్నా ఆమె తనకు తోచిన సాయం చేసింది. అయితే తాత్కాలికంగా ఆ సమస్య పరిష్కారం కాలేదు. కానీ తన సమస్యను విన్న ఆమెను చూసి అతనికి ఎంతో సంతోషం కలిగింది..
ఇక్కడ చెప్పేది ఏందంటే ప్రతి వ్యక్తి సంతోషంగా.. దుఃఖంగా ఉండగలుగుతాడు. సంతోషం అనగానే చాలామంది వస్తూ ఉంటారు. కానీ బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకునే వ్యక్తి నిజమైన సన్నిహితుడు లేదా స్నేహితుడు. ఇలాంటి వ్యక్తి మన జీవితంలో ఆడ లేదా మగ వ్యక్తి ఎవరైనా ఉన్నా సరే వారితో గడిపే జీవితమే అసలైన ఎంజాయ్మెంట్. అలాంటి వ్యక్తి ఒక్కసారి పరిచయమైతే వారిని జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండలేక పోతారు. అంతేకాకుండా ఒక్కరోజు వారు కనిపించకపోతే వారు ఎప్పుడు వస్తారు? అని వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ వ్యక్తి కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ ఒకసారి ఎదురుపడతారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదు. ఎందుకంటే కేవలం సమస్యల పరిష్కారానికి కోసం మాత్రమే కాకుండా వారితో ఉన్నంతసేపు జీవితం ఎంతో ప్రశాంతంగా, సుఖంగా ఉంటుంది.
అందువల్ల నిజమైన ఎంజాయ్మెంట్ కోరుకునేవారు ఇలాంటి నిజాయితీ, ఎదుటివారిని అర్థం చేసుకునే వ్యక్తులను ఎప్పుడు దగ్గరే ఉంచుకోవాలని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. వీరితోనే జీవితంలో అసలైన ఎంజాయ్మెంట్ ఉంటుందని అంటున్నారు. అయితే చాలామంది జీవితంలో ఇలాంటివారు కనిపించకపోవచ్చు. ఒకవేళ వారి మనసుకు నచ్చి ఈ వ్యక్తి మనకు సరైనోడు అని అనిపిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టవద్దు..