Vastu Tips: వాస్తు ప్రకారం చూసుకుంటే ప్రతి ఇంటికి ఈశాన్యం ముఖ్యమే. అందుకే ఈశాన్యంలో బరువు ఉండకూడదని చెబుతుంటారు. ఇంటి నిర్మాణంలో ఈశాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈశాన్యాన్ని సరైన విధంగా ఉంచుకోకపోతే మనకు నష్టాలే. ఈ నేపథ్యంలో ఈశాన్యం ఎలా ఉంచుకోవాలో వాస్తు శాస్త్ర్తం చెబుతుంది. సంపాదన పెరగాలంటే ఈశాన్యం దిక్కులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెబుతారు. చిన్ని చిన్న పొరపాట్లతో మన సంపాదనపై పెను ప్రభావం పడుతుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి.

ఈశాన్య భాగంలో ఉత్తరం వైపు ద్వారం ఉండేలా చూసుకోవాలి. దీంతో కూడా డబ్బు బాగానే వస్తుంది. మన సంపాదన పెరిగేందుకు ఇది కూడా ఒక మార్గమే. అందుకే వాస్తు ప్రకారం చూసుకుంటే ఈశాన్యం ఉత్తరం మూల వైపు ఓ ద్వారం ఉండేలా చూసుకుంటే ప్రయోజనమే. ఇంకా ఈశాన్యం తూర్పు వైపు కూడా మరో ద్వారం ఉంచుకోవాలి. దీంతో కీర్తిప్రతిష్టలు ధనప్రాప్తి ఉంటుంది. దీంతో ఈశాన్యం దిశను జాగ్రత్తగా ఉంచుకుని ఈ ద్వారాలు ఏర్పాటు చేసుకుంటే మనకు డబ్బు సులభంగా వస్తుందని తెలుసుకోవాలి.
ఈశాన్యంలో సంపు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమే. దీంతో కూడా మనకు డబ్బుకు లోటుండదని తెలుస్తోంది. భారీగా ఉండే వస్తువులను దక్షిణం వైపు ఉంచుకోవాలి. దీని వల్ల కూడా ఇంట్లోకి డబ్బు ఇంట్లోకి రావొచ్చు. నైరుతి వైపు నిర్మించే భారీ నిర్మాణాలతో కూడా ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. పడమర వైపు ఉండే అపార్ట్ మెంట్లలోకి కూడా ధనం ఎక్కువగానే వస్తుంది. దీంతో ఇల్లు నిర్మించుకునేటప్పుడు వాస్తు ప్రకారం చూసుకుని కట్టుకుంటే ప్రయోజనం కలుగుతుంది.

వాస్తు అంటే ఇల్లే కాదు వస్తువులు కూడా. ఏ వస్తువును ఎక్కడ ఉంచుకోవాలో కూడా వాస్తు శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. పక్కా వాస్తు ప్రకారం మన వస్తువులు అమర్చుకుంటే మేలు కలుగుతుంది. బీరువా, గడియారం, బంగారం, నగలు ఎక్కడ ఉంచుకోవాలో కూడా వాస్తు ప్రకారం చెబుతారు అందుకే వాటన్నింటిని తెలుసుకుని మన ఇంట్లో వస్తులు అమర్చుకుని వాస్తు లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి.
[…] Also Read: Vastu Tips: వాస్తు ప్రకారం ఈశాన్యానికి ఉన్న … […]