Guava Fruit Benefits: పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఉండే ప్రొటీన్లతో ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పండ్లలో మేటి పండుగా జామపండుకు పేరుంది. ఇందులో విటమిన్ సి, లైకోపీస్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో మన ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. జీర్ణక్రియ సరిగా జరిగేందుకు దోహద పడతాయి. మలబద్ధకం సమస్య రాకుండా చేస్తాయి. విరేచనాలకు కూడా విరుగుడుగా పనిచేస్తాయి. ఇలా జామ పండ్లతో పాటు వాటి ఆకులు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి.

జామ ఆకుల్లో కూడా మంచి పోషకాలు ఇమిడి ఉన్నాయి.శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యత ఉండటానికి సాయపడతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామలో ట్రైగ్లిజరైడ్, చెడు కొవ్వును అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బుల ముప్పు రాకుండా చేస్తాయి. జామలో ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉండటంతో ఇది మధుమేహ రోగులకు మంచి ఆహారమే. పండ్లన్నింటిలో కూడా మంచి పోషకాలు ఉన్న వాటిలో జామ మొదటిస్థానంలో ఉంటుంది. సాధారణ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.
జామపండులో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. దీంతో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
జామను సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. ఇందులో ఉండే పోలిక్ యాసిడ్, విటమిన్ బి శిశువు నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆడవారు గర్భం ధరించినప్పుడు వీటిని తింటే పలు రకాల ప్రయోజనాలు దక్కుతాయి. జామ పండు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మెగ్నిషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆకలిని తగ్గిస్తాయి.

అధిక బరువును కూడా నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఏ వయసు వారైనా జామ పండును తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. పలు రకాల వ్యాధులను దూరం చేయడంలో ఇవి కారణమవుతాయి. జామ పండులో పోషకాలు మెండుగా ఉండటంతో దీన్ని తీసుకుని తమ అనారోగ్యాలను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జామకు ఆయుర్వేదంలో కూడా మంచి స్థానం కల్పించారు. జామ పండు అన్ని రకాల వ్యాధులు ఉన్న వారు సైతం వినియోగించుకుంటే వారి రోగాలు నయం కావడంలో ఇవి ప్రధానంగా ఉపయోగపడతాయి.