spot_img
Homeలైఫ్ స్టైల్Garlic Benefits: ఎప్పుడూ ఆస్పత్రికి వెళ్లకూడదంటే ఈ రెండూ కలిపి తినండి చాలు

Garlic Benefits: ఎప్పుడూ ఆస్పత్రికి వెళ్లకూడదంటే ఈ రెండూ కలిపి తినండి చాలు

Garlic Benefits: మనం తీసుకునే ఆహారాలే మనకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. సహజసిద్ధమైన వాటిని తీసుకోకుండా ఇష్టారాజ్యంగా మసాలాలు వాడుతూ తినడం వల్ల అవి తెచ్చే ముప్పుతో శరీరం మొత్తం గుల్లబారుతోంది. అవయవాలపై ప్రభావం చూపుతోంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. రోజులో కనీసం ఒక పూటైనా ఉడకని ఆహారం తీసుకుంటే మేలని నిపుణులు చెబుతున్నా వినడం లేదు. నూనె, ఉప్పు, కారం విచ్చలవిడిగా వాడుతూ మన దేహానికి నష్టం కలిగిస్తున్నాం. ఫలితంగా ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ సంపాదించిన సొమ్మంతా ఖర్చు చేస్తున్నాం. కొన్ని రకాల ట్రిక్కులు పాటిస్తే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా రాదు. అవేంటో తెలుసుకుని పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండటం ఖాయం.

Garlic Benefits
Garlic Benefits

ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి. ఎంత పెద్ద వ్యాధినైనా నయం చేసే పద్ధతులు కనిపిస్తాయి. కానీ మనం పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఓ ఇరవై వెల్లుల్లి రెబ్బలను తీసుకుని ఒక గిన్నెలో వేసి అవి మునిగేంత వరకు తేనె పోయాలి. తరువాత కలుపుకుని వాటిని ఓ గాజు సీసాలో భద్రపరచుకోవాలి. వారం రోజుల తరువాత వెల్లుల్లి రెబ్బలను తీసుకుని రోజుకు రెండు చొప్పున ఉదయాన్నే పరగడుపున కడుపులోకి తీసుకోవాలి. దీంతో ఎన్నో రోగాల నుంచి ఉపశమనం పొందొచ్చు. జీర్ణ సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మసంబంధ సమస్యలు కూడా పోతాయి.

శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తుంది. కొవ్వు పేరుకుపోతే గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. వెల్లుల్లిలో అన్ని మంచి గుణాలు ఉన్నందున మన పూర్వీకులు వంటల్లో విరివిగా వాడేవారు. రక్తపోటును నియంత్రిస్తాయి. షుగర్ వ్యాధికి కూడా మంచి మందులా ఇవి ఉపయోగపడతాయి. ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Garlic Benefits
Garlic Benefits

శరీరంలో ఉండే నొప్పులను తగ్గిస్తాయి. ప్రతి రోజు వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో ముడతలు రాకుండా ముసలి తనం ఏర్పడకుండా నిరోధిస్తుంది. వీటిని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. ఎలాంటి ఇతర సమస్యలు రావు. వైద్యుల చుట్టు తిరగకుండా చేస్తుంది. మనకు వచ్చే రోగాలను రాకుండా చేస్తుంది. అందుకే వెల్లుల్లిని ఆహారంలో కూడా చేర్చుకుని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇన్ని రకాల లాభాలు కలిగించే వెల్లుల్లి రెబ్బలను క్రమం తప్పకుండా తీసుకుని మంచి ఫలితాలు పొందేందుకు ప్రయత్నిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version