Vastu Tips: సాధారణంగా మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఎప్పుడూ జరిగిదే. మనకు వారిపై ఉన్న అభిమానం, స్నేహం, ప్రేమ ఇలా రకరకాల ఫీలింగ్స్ ను వ్యక్తపరుస్తూ బహుమతులు ఇస్తారు. అలాగే ఈవెంట్స్, బర్త్ డే వంటి సెలబ్రేషన్స్, ఫంక్షన్స్ ఇలా వేడుకలను పురస్కరించుకుని కూడా బహుమతులు ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బహుమతులుగా ఇవ్వకూడదని కొన్ని వస్తువులు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటిని గిఫ్టులుగా అందించడం వలన మన దురదృష్టాన్ని మనమే స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుందని చెబుతున్నారు. అయితే ఎటువంటి వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు? అనేది ఇప్పుడు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వీటిలో ముందుగా గడియారం.. మనలో చాలా మంది ఎక్కువగా గడియారాలను గిఫ్ట్ గా ఇస్తుంటారు. అయితే గడియారాలను బహుమతిగా ఇవ్వడం వలన ఆయుర్దాయం తగ్గుతుందంట. వాచీ లేదా గోడ గడియారం ఇవ్వడం మంచిది కాదట. ఈ విధంగా గడువు తేదీలు దాటిన బహుమతులను ఇవ్వడం వలన ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
వాలెట్.. పర్సులను, డబ్బు నిల్వ చేసే సంచులను కూడా బహుమతిగా ఇవ్వకూడదట. డబ్బులుంటే వాటిని గిప్టుగా ఇవ్వడం వలన మన ఆర్థిక శక్తిని బయటకు పంపినట్లు అవుతుంది. అందువలన ఇచ్చిన వారి వద్ద డబ్బు నిలబడదు. దీని వలన నష్టం కలుగుతుంది. అలాగే పదునైన వస్తువులను కూడా ఇవ్వకూడదట. కత్తులు, కత్తెరలు లేదా ఇతర పదునైన వస్తువులు దురదృష్టాన్ని తెస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగా పనికి సంబంధించిన వస్తువులను కూడా బహుమతులుగా ఇవ్వడం మంచిది కాదంట. ఇది మంచి చేయకపోగా ఇచ్చిన వారి జీవితంలో విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉందని నమ్ముతారని సమాచారం.