Diabetes: ఇటీవల కాలంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా షుగర్ పేషెంట్ల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి అని తెలిసినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితంగా లక్షలాది మంది మధుమేహుల సంఖ్య పెరుగుతోంది. ఏటేటా లక్షలాది కేసులు బయట పడుతూనే ఉన్నాయి. అయినా ప్రజల్లో చైతన్యం కలగడం లేదు. దీంతో మధుమేహం విస్తృతంగా వ్యాపిస్తోంది. షుగర్ చైనా, ఇండియాల్లోనే ఎక్కువగా పెరగడానికి కారణాలు ఉన్నాయి. రెండు దేశాల్లో ఎక్కువగా అన్నం తినడంతో మధుమేహం పెరుగుతోంది. అయినా ప్రజల్లో భయం మాత్రం కలగడం లేదు.

మధుమేహం అదుపులో ఉండాలంటే నడక తప్పనిసరి. రోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ బారిన పడిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఉపద్రవం ఉండదు. రాత్రి పూట తిన్న తరువాత వెంటనే పడుకోకుండా ఓ పదినిమిషాలు నడిస్తే కూడా మనం తిన్న పదార్థం తొందరగా జీర్ణం అయి మనకు ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకే మధుమేహులు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని తెలుసుకోవాలి.
రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకునేందుకు మధుమేహులు కొన్ని పనులు చేయాలి. రాత్రి పూట భోజనం చేశాక ఓ పది నిమిషాలు నడిస్తే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి పూట డిన్నర్ తరువాత వాకింగ్ చేసే వారిలో 22 శాతం వరకు షుగర్ లెవల్స్ తగ్గినట్లు పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. మధుమేహం సమస్య వాకింగ్ తోనే పరిష్కారమవుతుందని చెబుతున్నారు. శారీరక, మానసిక ఉల్లాసం కలిగి ఉంటే కూడా రోగాలు మన దరికి చేరవని తెలుస్తోంది.

మధుమేహంతో అన్ని శరీర భాగాలకు ప్రమాదం ఏర్పడే సూచనలు ఉన్నాయి. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోకపోతే గుండె, కిడ్నీలు, లివర్ పై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు డైట్ లో జాగ్తత్తలు తీసుకోవాలి. స్వీట్లు అసలే తినకూడదు. చక్కెర, తీయని పండ్లకు దూరంగా ఉంటేనే శ్రేయస్కరం. లేదంటే మధుమేహం శరీరాన్ని గుల్ల చేస్తోంది. ప్రమాదాలు చుట్టు ముట్టే అవకాశం ఉంది. మధుమేహులు షుగర్ ను నియంత్రణలో ఉంచుకోకపోతే అంతే సంగతి. డయాబెటిస్ అదుపులో ఉంచుకుంటే ఎలాంటి ఆపద మన దరిచేరదు.