Credit Card Bill: ప్రస్తుత కాలంలో చాలామంది వద్ద ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అవసరానికి డబ్బు అందించి.. కొన్ని రోజుల తర్వాత బిల్లు కోరే ఈ క్రెడిట్ కార్డుల వల్ల ఎంతోమందికి అనేక రకాలుగా ప్రయోజనాలు కలుగుతున్నాయి. అత్యవసర సమయంలో వీటిని ఉపయోగించుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డులో వాడడం ఎంత ముఖ్యమో.. వాటి బిల్లులు చెల్లించడం కూడా అంతే ముఖ్యం అని భావించాలి. ఒక్క ఈఎంఐ మిస్ కాకుండా క్రమ పద్ధతిలో క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లిస్తే రివార్డు పాయింట్స్ తో పాటు రుణాలు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది క్రెడిట్ కార్డు పై రుణం తీసుకొని సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు. క్రెడిట్ కార్డు సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని అనుకుంటారు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని ప్రయోజనాలు తగ్గిపోయి అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే?
క్రెడిట్ కార్డు వాడిన తర్వాత వాటిపై వచ్చే బిల్లును చూసి చాలామంది వినియోగదారులు షాక్కు గురవుతూ ఉంటారు. ఎందుకంటే వినియోగించినప్పుడు లేని భయం బిల్లు కట్టేటప్పుడు మొదలవుతుంది. కొంతమంది ఇబ్బడి ముబ్బడిగా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఆ తర్వాత బిల్లు చెల్లించేటప్పుడు డబ్బులు లేక అవస్థలు పడతారు. ఈ నేపథ్యంలో కొందరు వాటిని చెల్లించకుండా మిస్ చేస్తూ ఉంటారు. అయితే క్రెడిట్ కార్డులపై తీసుకున్న రుణాలు ఒకేసారి చెల్లించడం వల్ల ఆర్థిక భారం ఉండదని భావిస్తారు. ఇలా ఒకేసారి చెల్లించడాన్ని సెటిల్మెంట్ అంటారు. అయితే ఈ క్రెడిట్ కార్డు సెటిల్మెంట్ సాధారణంగా కాకుండా వడ్డీ తగ్గింపుతో ఉండడం వల్ల ప్రయోజనాలు తగ్గిపోతాయి.
ఉదాహరణకు ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు పై రుణం తీసుకొని దానిని చెల్లించేటప్పుడు వడ్డీ తగ్గింపు ఇవ్వమని లేదా తక్కువ మొత్తంలో కడతామని యాజమాన్యంతో సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇలా ఇలా చేయడం వల్ల కొంత మొత్తాన్ని తగ్గించి బిల్లును క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఒకేసారి బిల్లును చెల్లించడం వల్ల తక్కువ మొత్తం లో ఇచ్చామని సంతోష పడుతూ ఉంటారు. కానీ ఇది భవిష్యత్తులో మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇలా సెటిల్మెంట్ చేసిన వారికి ఆఫర్లు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే రివార్డు పాయింట్లు కూడా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ కొత్త రుణాలు తీసుకుంటూ ఉంటే.. వాటిపై వడ్డీ ఎక్కువ శాతం విధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా క్రెడిట్ కార్డు సెటిల్మెంట్ చేస్తారని అప నమ్మకం రుణ దాతల సంస్థలో కలుగుతుంది.
అందువల్ల బిల్లు కట్టలేని చివరి ప్రయత్నం గా మాత్రమే సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇలా కావాలని తక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు సెటిల్మెంట్ చేసుకుంటే భవిష్యత్తులో ప్రయోజనాలు మిస్ అవుతారు. అలా కాకుండా రెగ్యులర్గా ఈఎంఐ చెల్లించడం ద్వారా లేదా సాధారణ సెటిల్మెంట్ చేసుకోవడం ద్వారా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.