Chanakya Niti: ఆచార్య చాణక్యుడు డబ్బు గురించి చాలా విషయాలు చెప్పాడు. డబ్బు ఎలా సంపాదించాలి? సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? పొదుపు ఎలా చేయాలి? దానాలు చేస్తే ఏమవుతుంది అనే విషయాలపై వివరంగా తెలిపారు. డబ్బు అక్రమంగా సంపాదిస్తే ఎక్కువ కాలం నిలవదు. దీంతో దారిద్ర్యం పోదు. నీతితో సంపాదిస్తే మనకు మనశ్శాంతి ఉంటుంది. అదే అవినీతితో సంపాదిస్తే వరదలా పోతుంది. ఆగాన వచ్చింది భోగాన పోతుందంటారు. ఇలా డబ్బు సంపాదన గురించి ఎన్నో విధాలుగా చాటాడు.
తప్పుడు మార్గాల్లో ..
దొంగతనం, జూదం, అన్యాయం, మోసం పద్దతుల్లో డబ్బు సంపాదిస్తే అది ఎక్కువ కాలం నిలవదు. త్వరగా ఖర్చయిపోతుంది. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదిస్తే అది మన నాశనానికి దారి తీస్తుంది. న్యాయంగా సంపాదిస్తేనే అందులో మనకు ఎంతో విలువ ఉంటుంది. ఆ డబ్బు ఎక్కువ కాలం నిలుస్తుంది. మనల్ని సంఘంలో నిలబెడుతుంది.
మంచిమార్గమే..
దుఖం, బానిసత్వం వంటి అలవాట్లు కర్మ ఫలితంగానే వస్తాయి. దీంతో మనం గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో శిక్ష అనుభవించక తప్పదు. మంచి పనులు చేస్తేనే మనకు ముక్తి లభిస్తుంది. దుష్కర్మలు చేయడం వల్ల మన జీవితమే మారిపోతుంది. మనం చెడు దారుల్లో నడిస్తే మంచిది కాదు. సన్మార్గంలో నడవడమే శ్రేయస్కరం అని చాణక్యుడు చెప్పాడు.
డబ్బుంటేనే..
డబ్బు ఆధారంగా మనుషులను గౌరవిస్తున్నారు. డబ్బుంటే చాలు వాడికి విలువ ఇస్తున్నారు. డబ్బు లేదంటే పట్టించుకోవడం లేదు. డబ్బు ఆధారం కాదు. గుణమే ప్రధానం. అన్నింటికి మూలమే గుణం. అతడి గుణం మంచిదైతే చాలు గౌరవిచాలి. కానీ డబ్బు ఉంటేనే గౌరవించడం కరెక్టు కాదు. కానీ ఇప్పుడు డబ్బుకు లోకం దాసోహం అవుతోంది.