Chanakya Niti Poverty: పేదరికంలో పుట్టడం తప్పు కాదు. కానీ పేదరికంలోనే చావడం తప్పు. మనిషి తన మేథస్సుతో ఎంతో ఎదగొచ్చు. కొందరు మాత్రం ఎదగకుండా అలాగే ఉండిపోతారు. తోటి వారు ఎన్నో అందలాలు ఎక్కుతుంటే మా కర్మ ఇంతే అని సరిపెట్టుకుంటారు. కానీ అది తప్పు. మనిషికి ఉన్న తెలివితేటలతో ఎన్నో విషయాలు తెలుసుకుని తన బతుకు గమనాన్ని మార్చుకోవచ్చు. తన ఆర్థిక ఒడిదుడుకులను ఎదిరించి నిలవచ్చు.తన ఊహల ప్రపంచాన్ని చేరుకునేందుకు నిత్యం శ్రమిస్తే కచ్చితంగా ఫలితాలు వస్తాయి. దీనికి ఏం చేయాలో సూచించాడు ఆచార్య చాణక్యుడు.
ఆర్థిక ప్రణాళిక ఉండాలి
ప్రతి మనిషికి తన లక్ష్యం చేరేందుకు కావాల్సిన ప్రణాళిక ఉండాలి. అదే విజన్ తో ముంది్లిస్తాం. కానీ అది కాదు. మనం తెలివిగా ఆలోచిస్తే మన జీవితం మారిపోతుంది. మన ఆలోచనలు మందగిస్తే అంతేసంగతి. ప్రతి మనిషికి మెదడు 1350 గ్రాములే ఉంటుంది. అది ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనకు ఫలితాలు ఇస్తుంది. అందుకే మన మెదడును ఉపయోగించుకుని మన తెలివితేటలు పెంచుకుని పేదరికం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.
కుటుంబ నేపథ్యం
మనిషి ఎదగడానికి కుటుంబ నేపథ్యం కూడా ఉపయోగపడుతుంది. మన ఆలోచనలు బలోపేతం కావాలంటే కుటుంబ సభ్యులతో పంచుకుంటే కూడా వారు మనకు సరైన దిశానిర్దేశం చేస్తారు. దీంతో మనం జీవితంలో ఎదిగేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. ఎవరి మెదడులో ఏముంటుందో ఎవరికి తెలుసు. అందుకే మన కుటుంబంతో కూడా మనం మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. జీవితంలో ఎదిగేందుకు మార్గాలు వేసుకోవచ్చు.
పొదుపు
జీవితంలో మనకు డబ్బు అవసరాలు ఎప్పుడు ఉంటాయి. మనం సంపాదించే దానిలో కొంత మొత్తం పొదుపు చేయాలి. అప్పుడే మనకు భవిష్యత్ పై భరోసా ఉంటుంది. అంతేకాని ఎప్పుడు వచ్చినవి అప్పుడు ఖర్చు చేస్తుంటే మనకు డబ్బులు ఇబ్బందులు పెడతాయి. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు మనం ఇతరులకు చేయి చాచకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కూడా పేదరికాన్నిదూరం చేస్తుంది. ఖర్చులను అదుపు చేయకపోతే పొదుపు సాధ్యం కాదు.
నైపుణ్యత లోపించడం
కొందరు ఎంత చదువుకున్నా తెలివి లేకుండా ఉంటారు. దీంతో వారి చదువు నిరర్థకమే అవుతుంది. నైపుణ్యం లేకపోతే మనం ఎందులో కూడా రాణించలేం. అలా ఉంటే మనకు ఏ ఉద్యోగం రాదు. వచ్చినా ఎక్కువ కాలం నిలవలేం. అందుకే మన నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం మన మీదే ఉంటుంది. రోజురోజుకు మనలో ఉన్న నైపుణ్యాలను పెంచుకుని వృత్తిలో రాణించాలి. అప్పుడే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పేదరికం నుంచి బయటపడొచ్చు.
దురలవాట్లు
మనిషికి దురలవాట్లు ఉంటే చెడిపోతాడు. మంచి పనుల మీద శ్రద్ధ తగ్గుతుంది. దీంతో ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. మనలో ఉండే చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. మంచి అలవాట్లను దగ్గర చేసుకోవాలి. అప్పుడే మనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోతాయి. చెడు వ్యసనాలకు బానిస అయితే బతుకే దుర్భరంగా మారుతుంది. పేదరికంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. చాణక్యుడు సూచించిన ప్రకారం వీటిని పాటిస్తే మనకు పేదరికం రానే రాదు.