Chanakya Niti Works: ఆచార్య చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పాడు. తన నీతిశాస్త్రంలో మనిషి మనుగడకు అవసరమయ్యే వాటి గురించి కూలంకషంగా వివరించాడు. ఏ రకమైన పనులు చేయాలి? ఎలా చేయాలి? ఏ పని చేస్తే ఏమవుతుంది? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అనే పలు విషయాలు ఆసక్తికరంగా తెలియజేశాడు. అందుకే ఇప్పటికి కూడా చాణక్యుడి నీతి శాస్త్రం మనకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది.
చాణక్యుడు ఏ పని మొదలు పెట్టినా దాన్ని పూర్తి చేయాలంటాడు. అధముడు ఏ పని మొదలు పెట్టడు. మధ్యముడు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేస్తాడు. ఉత్తముడు దాన్ని పూర్తి చేస్తాడు. పనుల విషయంలో చాణక్యుడు చూపిన మార్గం అనుసరణీయం. ఏ పనైనా మొదలు పెట్టొద్దు. పెడితే దాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించకూడదు. పని చేయి కాని ఫలితం గురించి ఆలోచించకు.
పూల వాసన గాలి వీస్తున్న వైపే వెళ్తుంది. అలాగే మంచి పనులు కూడా నలుగురికి ఉపయోగపడతాయి. వాటిని ఆపకూడదు. పూర్తి చేస్తేనే మనకు గుర్తింపు. ప్రారంభించిన పని పూర్తి చేసే వరకు ఉదాసీనంగా ఉండకూడదు. నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ ఆ పనిని పూర్తి చేసేందుకు తగిన వనరులు సమకూర్చుకోవాలి. అలా చాణక్యుడు తన పుస్తకాల్లో ఎన్నో ఉదాహరణలతో వివరించాడు.
మనం పుస్తకాలు చదివితే మంచి జ్ణానం వస్తుంది. చెడ్డ పుస్తకాలు చదివితే మన తెలివి అంతరించిపోతుంది. పుస్తక పఠనం మనిషి మేథస్సును పెంచుతుంది. ప్రపంచం గురించి తెలియజేస్తుంది. అందుకే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే మనకు పదసంపద కూడా దక్కుతుంది. దీంతో మన తెలివితేటలు కూడా పెరుగుతాయి.