Devotional Tips: సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో ఎన్నో వాస్తు నియమాలను పాటిస్తాము. ఇలా వాస్తు నియమాలను అనుసరిస్తూ ఇంటి నిర్మాణం చేపట్టడం వల్ల ఆ ఇంటిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని భావిస్తారు. ఇకపోతే చాలా మందికి ఇంటి నిర్మాణ విషయంలో ఒక సందేహం ఉంటుంది. ఆలయానికి సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చా ఒకవేళ ఆలయం నీడ ఇంటి పై పడితే ఏం జరుగుతుంది అనే సందేహాలు కలుగుతుంటాయి. అయితే ఆలయ సమీపంలో ఇంటిని నిర్మించటం వల్ల ఏం జరుగుతుంది? ఏ ఆలయం సమీపంలో ఇంటి నిర్మాణం ఎంత దూరంలో నిర్మించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయం నీడ ఇంటిపై పడకూడదు అని చెపుతారు అందుకే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆలయానికి సమీపంలో మన ఇంటిని నిర్మించుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలా ఆలయం నీడ మన ఇంటి పై పడితే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తగ్గిపోతుందని ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సాధారణంగా మూడు రకాల ఆలయాలు ఉన్నాయి ఒకటి శివాలయం, రెండు వైష్ణవాలయం, 3 శక్తి స్వరూప ఆలయాలు.
శివాలయం విషయానికి వస్తే ఆలయం ఉన్న అన్ని దిక్కుల 100 బారాల లోపు ఇల్లు నిర్మించకూడదు. ఇలా అన్నివైపుల 100 బారల స్థలం విడిచిపెట్టాలి. పరమేశ్వరుడికి మూడు కళ్ళు ఉంటాయి కనుక ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు తన మూడో కంటిని తెరిచిన సమయంలో అతని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది కనుక శివాలయానికి సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టకూడదని చెబుతారు
విష్ణు ఆలయానికి వెనుక భాగంలో ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. విష్ణువు అలంకార ప్రియుడు, ఈయన సూర్యనారాయణ అవతారంలో ఉన్నప్పటికీ సూర్యుడి వృత్తాకార కిరణాలు సౌమ్య రూపంలో విష్ణుమూర్తి వెనుక భాగాన చక్రంలో తిరుగుతూ ఉంటాయి.అదే చక్రం రాక్షసులతో కూడా పోరాడుతుంది కనుక విష్ణుదేవుడి ఆలయం వెనుక భాగంలో ఇంటి నిర్మాణం చేపట్టకూడదు.
ఇక శక్తి స్వరూపిణి ఆలయాలు అయినా అమ్మవారు ఎంతో ఆగ్రహంతో ఉంటారు అలాగే వారి రెండు చేతులలో మారణాయుధాలు ఉంటాయి కనుక అమ్మవారి ఆలయం కుడివైపు ఎడమవైపు 120 బారల స్థలం వదిలి ఇంటి నిర్మాణం చేపట్టాలి. అందుకే శక్తి స్వరూపిణి ఆలయాలకు ఇల్లు దగ్గరగా ఉండకూడదు. ఇకపోతే ప్రతి ఆలయం ముందు ధ్వజస్తంభం ఉండటం మనం చూస్తుంటాము. ఈ ధ్వజస్తంభం దీపపు స్థంభం అని కూడా అంటారు. ధ్వజస్తంభంపై దీపం వెలిగించడం వల్ల ఆకాశంలో విహరించే దేవతలకు దారి చూపుతుంది ఆ సమయంలో దేవుడు దేవేరులతో కలిసి విహరిస్తూ ఉంటాడు కనుక ఆ దీపపు వెలుగును మనం చూడకూడదు. అందుకే ధ్వజస్తంభం సమీపంలో కూడా ఆలయ నిర్మాణం చేపట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.