Build House- Interest Rates: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు ఇల్లు కట్టినా పెళ్లి చేసినా అప్పులే తప్ప ఏమీ మిగలదు. ఇల్లు కడితే అప్పు పెళ్లి చేస్తే కూడా కూడా చివరకు అప్పే మిగులుతుంది. అందుకే ఇటీవల కాలంలో ఇల్లు కట్టుకోవడం ఓ కలగా మారింది. సామాన్యుడికి సైతం జీవితంలో ఓ మంచి ఇల్లు కట్టుకుని ఓ కారు కొనుక్కుని హాయిగా జీవించాలని ఆశలు ఉండటం సహజమే. దీంతోనే ఇల్లు కట్టుకోవాలని తన జీవితాంతం కల కంటూనే ఉంటాడు. కొందరి కలలు నెరవేరినా కొందరికి మాత్రం పరిస్థితులు అనుకూలించక పోతే ఇల్లు కట్టుకోవాలనే వాంఛ తీరడానికి జీవిత కాలమే పట్టనుంది.

ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో రుణం తీసుకోవాల్సిందే. దానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మనం తీసుకున్న రుణం తొందరగా తీరాలంటే ఎక్కువ మొత్తం ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. తక్కువ మొత్తంలో ఈఎంఐలు కడితే ఎక్కువ రోజులు చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కోసం రుణం తీసుకుంటే వడ్డీలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ భవిష్యత్ లో కూడా వడ్డీ రేట్లు ఇలాగే ఉంటాయని ాలోచించాల్సిన అవసరం లేదు.
Also Read: Imran Khan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ హత్యకు సి.ఐ.ఎ ప్లాన్ వేసిందా?
ఈ నేపథ్యంలో ఇల్లు కట్టుకోవడానికి మంచి సమయమే అని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు మారుస్తుందని తెలిసినా భవిష్యత్ లో అవి ఏ మేరకు ఉంటాయో అర్థం కావడం లేదు. దీంతో ప్రస్తుత తరుణంలోనే ఇల్లు కట్టుకోవడానికి అనువైన సమయంగా గుర్తుంచుకోవాలి. అందుకే ఇల్లు కోసం సామాన్యుడు తన చిరకాల ఆశయంగా పెట్టుకోవడం తెలిసిందే. అందుకే తన కల నెరవేర్చుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తాడు.

హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, డిల్లీ, కోల్ కత వంటి నగరాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక నగర శివారు ప్రాంతాలు కూడా బాగా ధరలు మోగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యుడి ఇంటి కల ఓ స్వప్నంగానే మారుతోంది. కానీ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని తమ కలల ఇంటిని నిర్మించుకోవాలని చూస్తున్నారు. దాని కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. సొంతంగా ఇల్లు నిర్మించుకుని జీవితంలో స్థిరపడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
Also Read:IND vs SA Final Match: చావో రేవో: సౌతాఫ్రికాతోనే నేడే భారత్ టీ20 ఫైనల్.. ఎవరు గెలుస్తారు?