Homeలైఫ్ స్టైల్Bucket Of Water In AC Room Benefits: ఏసీ గదిలో బకెట్ నీరు పెడితే...

Bucket Of Water In AC Room Benefits: ఏసీ గదిలో బకెట్ నీరు పెడితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..

Bucket Of Water In AC Room Benefits: ప్రస్తుత పరిస్థితిలో ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఇంట్లో కూడా వేడి వాతావరణంతో భరించలేని ఉక్క పోత ఉంటోంది. దీంతో చాలామంది ఫ్యాన్లు, కూలర్ల కంటే ఏసీలే ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ధర కాస్త ఎక్కువగా ఉన్నా కూడా.. చల్లదనం కోసం ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఏసీ ఉండే గదులు కూడా ఒక్కోసారి పొడి వాతావరణాన్ని ఏ పరుస్తాయి. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గదిలో పొడి వాతావరణం కాకుండా తేమ వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి తేమ వాతావరణం ఉండాలంటే ఈ బకెట్ చిట్కా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అసలు ఏంటి ఈ బకెట్ చిట్కా? దీనిని ఎలా ఉంచాలి?

ఏసీ ఎక్కువగా ఉండే గదుల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఇలాంటి సమయంలో తేమ వాతావరణం ఉంటేనే ఇంట్లో వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. లేకుంటే చర్మ సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కళ్ళు మాట్లాడడం లేదా గొంతు నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏసి ఉండే గదిలో ఒక బకెట్లో నీరు పోసి ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల అనేక రకాలుగా ఉపయోగాలు ఉంటాయి.

ఏసీ గదిలో బకెట్ నీరు ఉండడం వల్ల శ్వాసకోశ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొందరికి ఏసీ గదుల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వీరికి ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి. అయితే గదిలో బకెట్ నీరు ఉండడంవల్ల గాలి నాణ్యత పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడవు. అలాగే గాలిలో తేమ కూడా ఉండడం వల్ల చర్మంపై ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి.

ఏసీ గదిలో బకెట్ తో నింపిన నీరు ఉండడం వల్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశం కూడా ఉంది. సాధారణంగా 1.5 టన్ ఏసి 24 నుంచి 26 సెంటీగ్రేడ్ వద్ద సాధారణమైన విద్యుత్ బిల్లు నమోదు అవుతుంది. అయితే బకెట్ తో నింపిన నీరు ఈ గదిలో ఉంచడం వల్ల ఏసీ నుంచి వచ్చే గాలితో గది తొందరగా కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఏసీ టెంపరేచర్ ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

చాలామంది ఇండోర్లో మొక్కలు పెంచుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఏసీ గాలితో మొక్కలు త్వరగా ఎండిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ గదిలో బకెట్ మీరు ఉండడం వల్ల గాలిలో తేమ ఏర్పడి మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి. అయితే ఏసీ గదిలో బకెట్ నీరు ఏర్పాటు చేసేటప్పుడు బకెట్ పైభాగం ఎక్కువ వెడల్పుతో ఉండాలి. అంతేకాకుండా ఈ బకెట్ నీరును ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అలా చేస్తేనే గాలిలో తేమ స్వచ్చంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular