Bathukamma Celebrations 2025: ఇటీవల మొబైల్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా షార్ట్ వీడియోస్.. స్టేటస్, యూట్యూబ్, ఇంస్టాగ్రా.. ఇలా ఏ యాప్ చూసిన షార్ట్ వీడియోస్ కనిపిస్తున్నాయి. అయితే షార్ట్ వీడియోస్ లో ఒక విషయం పూర్తిగా చెప్పే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్, కౌన్సిలింగ్, హెల్త్ ఇలా ఎన్నో రకాలుగా వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఏదైనా ఫెస్టివల్ వచ్చే ముందు దానికి సంబంధించిన వీడియోస్ సందడి చేస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 21 నుంచి బతుకమ్మల సందడి ప్రారంభం కానుంది. అక్టోబర్ 2 దసరా రాబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని షార్ట్ వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్నిటి గురించి..
షార్ట్ వీడియోస్ లలో ఎక్కువ శాతం కామెడీ వి బాగా ఆకట్టుకుంటాయి. అందులోనూ ముందు వచ్చే పండుగలు లేదా ప్రత్యేక కార్యక్రమాల గురించి వీడియోలు చేస్తే అవి వీక్షకుల నుంచి ఆదరణ పొందుతాయి. ఇటీవల బతుకమ్మకు సంబంధించిన వీడియోస్ ఇప్పటికే ట్రెండీగా మారాయి. బతుకమ్మ పండుగలో తంగేడు పువ్వు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తంగేడు పువ్వు లేకుండా బతుకమ్మ అనేది ఉండదు. అయితే ఈ తంగేడు పువ్వు కాలం మారుతున్న కొద్ది కరువుగా మారిపోయింది. మార్కెట్లోకి రావడం తగ్గిపోయింది. మార్కెట్లో తంగేడు పువ్వు తగ్గడంపై చేసిన వీడియోలు ఆకట్టుకుంటున్నాయి.
అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే సన్నివేశాల సంబంధించిన వీడియోలు ఈ పండుగ సందర్భంగా ఒక్కొక్కటి ట్రెండ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి దసరా సెలవులు కూడా ప్రారంభమవుతున్నాయి. దీంతో చాలామంది రిలాక్స్ మూడులో ఉండడంతో ఈ షార్ట్ వీడియోస్ అత్యధిక వ్యూస్ ను తెచ్చుకుంటాయి. అయితే ఇదే సమయంలో ఎన్నో రకాల వీడియోలు వచ్చినా.. ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాయి.
బతుకమ్మ, దసరా, దీపావళికి సంబంధించిన వీడియోస్ చాలామంది చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు అంతా కలిసి వీడియోలు చేసేవారు ఉన్నారు. ఈ పండుగ సీజన్ లో మీరు మరింత ఆకట్టుకునే వీడియోలు తీసుకురాబోతున్నారు. అయితే కొన్ని వీడియోలు తీయడంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. గతంలో బతుకమ్మ పండుగ సందర్భంగా కొందరు బీరు బాటిల్ ను మధ్యలో ఉంచి బతుకమ్మ ఆడారు. ఈ వీడియో వరల్డ్ వైడ్ గా ఎంతో ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఇలా చేసిన వారిపై విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రజలు ఎంతో గౌరవంగా భావించే బతుకమ్మను మద్యం పార్టీలతో ఎలా పోలుస్తారు? అని కొందరు విమర్శించారు. అందువల్ల ఏదైనా వీడియోలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు.
బతుకమ్మ షురూ.. అట్లుంటదీ మరీ pic.twitter.com/ycgtQTq7mz
— Naresh Aennam (@AennamNaresh) September 20, 2025