Life lessons from Baahubali characters: బాహుబలి 7 క్యారెక్టర్స్.. మన జీవితానికి నేర్పే గొప్ప పాఠాలివీ

Life lessons from Baahubali characters: తెలుగు దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి రచించి.. తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతూ ఉంటాయి. సోసియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని చాలామంది ప్రేక్షకులు అంటూ ఉంటారు. సాధారణ సినిమాలో హీరో హీరోయిన్ మాత్రమే హైలెట్గా నిలుస్తారు. కానీ బాహుబలి సినిమాల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్లు ఒకదానితో మరొకటి లింక్ అయి ఉంటాయి. అయితే సినిమాలో ఊహించి ఈ క్యారెక్టర్ లను సృష్టించినా.. రియల్ లైఫ్ లో ఈ పాత్రలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఏడు పాత్రల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఈ ఏడు పాత్రలు మనం జీవితంలో చూసేవే. వీటిని దృష్టిలో ఉంచుకొని మనం జీవితాన్ని చక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఏడు పాత్రల గురించి తెలుసుకుందామా..

బాహుబలి:
ప్రభాస్ పోషించిన ఈ పాత్ర సినిమాకు మెయిన్ గా నిలుస్తుంది. ఎటువంటి ఆపదనైనా గట్టెక్కించే శక్తి ఉన్న ఈ క్యారెక్టర్ మంచితనం, మానవత్వం తో కూడుకొని ఉంటుంది. అలాగే భయంకరమైన యుద్ధాన్ని కూడా ప్లానింగ్ తో గెలిచే ఈ పాత్ర సినిమాకు నెంబర్వన్ గా ఉంటుంది. అయితే బాహుబలిలో ఉన్న మంచితనం అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. చుట్టుపక్కల ఉండేవారే తన జీవితానికి విలన్ల ఉంటారు. అంటే ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండే వారితో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని ఈ పాత్ర తెలుపుతుంది.

కట్టప్ప:
ఎదుటివారు ఎంతటి బలవంతుడైన వారిని చేదించగలిగే ధైర్యం.. రాజులకు నమ్మకంగా ఉండే మనస్తత్వం.. ఇచ్చిన మాట కోసం చేసే పని ఈ పాత్ర తెలుపుతుంది. అంటే నిజజీవితంలో కూడా కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని ఈ పాత్రను చూస్తే తెలుస్తుంది. అలాగే ఎలాంటి సమస్య వచ్చినా భయపడిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి అని కట్టప్ప పాత్రను చూస్తే తెలుస్తుంది.

శివగామి:
కన్న కొడుకుని కాకుండా శక్తి సామర్ధ్యాలు, మంచితనం, మానవత్వం ఉన్న బాహుబలిని రాజుగా చేయాలని మనస్తత్వం శివగామిలో ఉంటుంది. అంతేకాకుండా తన సొంత కొడుకు కాకుండా తల్లి ప్రేమను చూపిస్తూ అలరిస్తుంది. రియల్ లైఫ్ లో కూడా సొంతవారు .. పరాయివారు అని కాకుండా మంచి వ్యక్తులను ఆదరించాలని ఈ పాత్ర తెలుపుతుంది.

బల్లాల దేవ:
ఒక మనిషిలో ఉండే క్రూరత్వం, అహంకారం ఎంతటి బలవంతుడునైనా నాశనం చేస్తుందని బల్లాల దేవా పాత్ర తెలుపుతుంది. అంతేకాకుండా ఈ లక్షణాలు ఉన్నవారు తమ జీవితాన్ని మాత్రమే కాకుండా తమ వంశాన్ని కూడా నాశనం చేస్తారని ఈ క్యారెక్టర్ తెలుపుతుంది. నిజజీవితంలో కూడా ఈ రెండు లక్షణాలను కలిగి ఉన్నవారు తమ జీవితాలను నాశనం చేసుకుంటారని తెలుస్తుంది.

బిజ్జల దేవ:
అవిటి తనం అనేది అవయవాల్లో కాదు.. మనసులో ఉందని ఈ పాత్ర తెలుపుతుంది. తన శరీరం ఎలా ఉన్నా.. ఎదుటి వ్యక్తి నాశనం కావాలనే మనస్తత్వం ఉంటే ఎప్పటికైనా జీవితం సర్వనాశనమే అవుతుందని ఈ పాత్ర తెలుపుతుంది. నిజా జీవితంలో కూడా ఎదుటివారి నాశనం కోరుకునే లక్షణం ఉండదని దీనిని చూస్తే నేర్చుకోవచ్చు.

కుమార వర్మ:
తనలో శక్తి ఉందని.. అయితే అది సందర్భం బట్టి బయటకు వస్తుందని ఈ పాత్ర తెలుపుతుంది. అలా వచ్చినప్పుడు కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. నిజజీవితంలో కూడా సందర్భాన్ని బట్టి బలనిరూపణ చేసే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి.

కాలకేయ:
జీవితంలో నేను గొప్ప అనుకోవడంలో తప్పులేదు. కానీ నేనే గొప్ప అని అనుకుంటే మాత్రం ఎదుటివారి చేతిలో పతనం కాక తప్పదు అని ఈ పాత్ర తెలుపుతుంది. నిజ జీవితంలో కూడా ఎవరికి వారు గొప్ప అనుకోవడంలో తప్పులేదు. కానీ తాను మాత్రమే ప్రపంచ విజేత అని అనుకోవడం మాత్రం సమంజసం కాదు అని ఈ పాత్ర తెలుపుతుంది.

Get notified whenever we post something new!

Continue reading

Pimples Solution: మొటిమల సమస్యతో బాధపడేవారికి గుడ్ న్యూస్..

Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మరికొందరు ఆర్థిక వనరులు లేక వీటిని తొలగించేందుకు రకరకాల టిప్స్ వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ స్కిన్ తో...

Teacher Viral Video: ఈ టీచర్ చేసిన పనికి.. పిల్లలు ‘మాకొద్దు మొబైల్’ అని అంటున్నారు.. వీడియో వైరల్

Teacher Viral Video: స్మార్ట్‌ఫోన్‌లు నేటి కాలంలో చిన్నారుల జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలన్నా, అన్నం తినిపించాలన్నా, ఏడుపు ఆపాలన్నా చాలా మంది తల్లిదండ్రులు వారి చేతిలో మొబైల్ ఫోన్ పెడుతున్నారు. అయితే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారి పిల్లల ఆరోగ్యం, చదువు, మానసిక వికాసంపై తీవ్ర...

Today 21 July 2026 Horoscope: రాశుల వారి ఇంట్లో సమస్యలు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

Today 21 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు. మరికొన్ని రాశుల వారి ఇంట్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version