Marriage and Job: పెళ్లి కావట్లేదు, ఉద్యోగం రావట్లేదని టెన్షన్ పడుతున్నారా?

పెళ్లి కాలేదని టెన్షన్ పడకండి. పెళ్లి అయిన తర్వాత సంసారం, పిల్లలు, వారి బాగోగులు అనే టెన్షన్ ఉంటుంది. అందరిలాగే మీకు కూడా ఇదే విధంగా ఉంటుంది జీవితం.

Written By: Swathi Chilukuri, Updated On : April 26, 2024 12:14 pm

Are you Worried about not getting married

Follow us on

Marriage and Job: పెళ్లి పెళ్లి పెళ్లి.. ఇదొక లొల్లి గా మారింది కదా. చదువు కాస్త అయిపోయిందా.. ఏం అబ్బాయి పెళ్లి ఎప్పుడు? ఏం అమ్మాయి ఇంకా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? బెండకాయ ముదిరినట్టు ముదురుతున్నారు కానీ పెళ్లి చేసుకోరే? అంటూ అబ్బో ఎన్ని మాటలు, దెప్పి పొడుపులు వినిపిస్తాయో. కాస్త పెళ్లి ఆలస్యం అయితే చాలు పక్కింటి వాళ్లు పొరుగింటి వారి మాటలు వినలేక పోవాలి. వీరందరిని చూసి పొద్దుకు పది సార్లు ఇంట్లో వాళ్లు పెళ్లి టార్చర్ చేస్తుంటారు కదా. మరి మీకు కూడా పెళ్లి కాలేదా?

పెళ్లి కాలేదని టెన్షన్ పడకండి. పెళ్లి అయిన తర్వాత సంసారం, పిల్లలు, వారి బాగోగులు అనే టెన్షన్ ఉంటుంది. అందరిలాగే మీకు కూడా ఇదే విధంగా ఉంటుంది జీవితం. కానీ వచ్చే భాగస్వామి మంచివారు అయితే సంతోషం, బాధ అన్ని కూడా కలిసి పంచుకుంటారు. లేదంటే ఒకరే భరిస్తారు అని అంటారు పెద్దలు. ఇంతకు మించి పెద్దగా పెళ్లి వల్ల జరిగేది ఏం లేదని.. అందుకే పెళ్లి కాలేదని చనిపోవడం, పిచ్చి వారిగా మారడం, మానసికంగా కుంగి పోవడం ఎందుకు అంటారు పెద్దలు.

ఉద్యోగం, పెళ్లి రెండు ఆలస్యం అయినా కూడా ఆవేదన చెందకుండా.. కాస్త సహనంగా, ఓపికగా ఉంటే అవ్వాల్సిన సమయంలో ఎలాంటి కార్యాలు అయినా జరుగుతాయి. కాస్త ధైర్యంగా ఉంటే చాలు అని హామీ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. చిన్న వాటికి ఎక్కువ ఆలోచిస్తూ లేని పోని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అందుకే కాస్త ఓపిక ముఖ్యం. మరి మీరు కూడా ఈ పెళ్లి కాని వారి జాబితాలో ఉంటే ఇంట్లో వాళ్లు ఫోర్స్ చేస్తుంటే కాస్త రిలాక్స్ గా ఉండండి. టెన్షన్ పడకుండా కూల్ గా ఉండండి.

కక్కు వచ్చినా, కళ్యాణం వచ్చినా ఆగదు అనే సామెత వినే ఉంటారు. సో మీకు ఓ టైమ్ వస్తుంది. అప్పుడు మంచి అయినా చెడు అయినా ఉద్యోగాన్ని, వైవాహిక జీవితాన్ని అనుభవించాల్సిందే. సో ఆల్ ది బెస్ట్ బ్యాచిలర్స్. డోంట్ వర్రీ ఎబౌట్ పెళ్లి, ఉద్యోగం.