Children smartphone addiction: విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి మొబైల్ తప్పనిసరిగా మారింది. మొబైల్ లేకుండా కొన్ని పనులు కావడం లేదంటే అతిశయోక్తి కాదు. అయితే పెద్ద వాళ్ళ విషయంలో మొబైల్ అన్ని రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. కానీ చిన్న పిల్లల విషయంలో ఇది ప్రమాదకరంగా మారుతుంది. కొందరు పిల్లలు మొబైల్ కు బానిసగా మారిపోతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురై వ్యాధి బారిన పడుతున్నారు. అయితే పిల్లలు మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇటీవల అమెరికాకు చెందిన NIH అనే సంస్థ తాజాగా ఓ అధ్యయనం బయటపెట్టింది. ఈ సంస్థ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి అంటే?
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆహారం తినడానికి మొబైల్ ను చూపిస్తూ ఉంటారు. అయితే ఇది ప్రారంభంలో వారి అవసరాలను తీర్చినా.. ఆ తర్వాత పిల్లలు దీనికి అడిక్ట్ అయిపోయి మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. మొబైల్ లేకుండా ఆహారం కూడా తినడం లేదు. స్కూలుకు వెళ్లే విద్యార్థులు సైతం ఇంటికి రాగానే ముందుగా ఫోన్ చూస్తున్నారు. ఇలా పదేపదే ఫోన్ చూడడం వల్ల మానసిక సమస్యలు వస్తాయని ఇప్పటికే చాలామంది వైద్యులు తెలిపారు. అయితే తాజాగా అమెరికాకు చెందిన National Institutes of Health (NIH) తాజాగా పదివేల మంది పిల్లలపై అధ్యయనం నిర్వహించింది. వీరిలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మొబైల్ చూస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతుంటాయో తెలిపింది.
ఈ సంస్థ తెలిపిన ప్రకారం 12 సంవత్సరాల లోపు పిల్లలు మొబైల్ కు అలవాటు పడితే వారిలో డిప్రెషన్, నిద్రలేమి, ఒబేసిటీ, అలసట వంటి సమస్యలు పెరిగినట్లు తెలిపింది.
ఫోన్ పదే పదేపడం వల్ల చాలామంది పిల్లలు డిప్రెషన్కు లోన్ అవుతున్నారు. చిన్న వయసులోనే వారికి కోపాలు పెరిగిపోతున్నాయి. అలాగే స్కూల్లో అందించే హోంవర్క్ సైతం వారు చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. తల్లిదండ్రులు చిన్న మాట అన్నా కూడా వారు తీవ్రంగా బాధపడిపోతుంటారు. అందువల్ల వీరికి మొబైల్ ఇవ్వకపోవడం మంచిదని అంటున్నారు.
ఇక చాలామంది పిల్లలు మొబైల్ చూస్తూ ఆహారం తింటూ ఉంటారు. మొదట్లో తల్లిదండ్రులు వీరికి మొబైల్ చూపించి ఆహారం వినిపించేవారు. అలా ఇది అలవాటుగా మారిపోయింది. 12 సంవత్సరాలు వచ్చిన వారు సైతం మొబైల్ లేకుండా ఆహారం తీసుకోవడం లేదు. ఫలితంగా పరిమితికి మించిన ఆహారం తినడం వల్ల ఒబేసిటీ పెరిగిపోతుంది.
చాలామంది మొబైల్ చూస్తున్న పిల్లలు చిన్న పనికి అలసటగా మారిపోతున్నారు. ముఖ్యంగా స్కూల్లో మిగతా పిల్లల్లో కంటే ఫోన్ ఎక్కువగా చూచే పిల్లలు హోం వర్క్ చేయలేక పోతుంటారు. అంతేకాకుండా మీరు చురుగ్గా ఉండలేకపోతుంటారు. ఫలితంగా మిగతా వారి కంటే వెనుకబడి పోతుంటారు. అందువల్ల తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు పిల్లలకు మొబైల్ ఇవ్వకుండా ఉండడమే ప్రయత్నించాలి. అలా చేస్తే ప్రస్తుతం వారు ఆనందపడినా.. భవిష్యత్తులో మాత్రం అనేక అనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది.