Children Care Home: చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏడాది వయసు రాగానే వారు బుడిబుడి అడుగులు వేస్తారు. చిట్టిపొట్టి మాటలు మాట్లాడుతూ తిరుగుతుంటారు. ఈ సమయంలో వారికి చేతికి ఏది అందితే దాన్ని చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వారి చేతికి ఏద అందకండా చూసుకోవాలి. ప్రమాకరమైన కత్తులు వంటివి చేతుల్లోకి తీసుకుంటే ప్రమాదం జరుగుతుంది. వీరికి అలాంటి వస్తువులు అందకుండా దూరంగా ఉంచాలి. వారిని ఎప్పుడు కనిపెడుతూ ఉండాల

పెన్నులు, పెన్సిళ్లు, బ్లేడ్లు వంటివి ఇంకా దూరంగా ఉండేలా చూడాలి. వాటితో చెవులు, ముక్కుల్లో పెట్టుకోకుండా జగ్రత్త పడాలి. ఇంట్లో వాటర్ హీటర్, ఐరన్ బాక్సులు వంటి వాటిని కూడా ముట్టుకోకుండా చూసుకోవాలి. విద్యుత్ ప్లగ్గులలో వేలు పెట్టకుండా గమనించాలి. విద్యుత్ స్విచ్ ల్లో వేలు పెడితే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న పిల్లలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. మిక్షర్, గ్రైండర్ వంటి వస్తువులను తాకకుండా చూసుకోవడం మంచిది. ఇంట్లో ఉండే వస్తువులను జాగ్రత్తగా దూరంగా ఉంచితే మేలు కలుగుతుంది.
వంట గదిలో ఉండే చాకులు, పోర్కులు అందకుండా జాగ్రత్త పడాలి. పిల్లలు వాటితో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దీంతో గీసుకునే ప్రమాదం ఉంటుంది. టీవీ స్టాండ్, డ్రెస్సింగ్ టేబుల్ అందకుండా చూసుకోవడం శ్రేయస్కరం. లేకపోతే వాటిని ఎక్కి కింద పడే అవకాశం ఉంటుంది. కరెండ్ వైర్లు, ఫోన్ వైర్లు కొరుకుతుంటారు. మొబైళ్లతో ఆడటం చేస్తుంటారు. ఇవి కూడా మంచిది కాదు. అందుకే పిల్లలకు ఏది కూడా అందుబాటులో లేకుండా చూసుకుంటే వారికి ఎలాంటి ముప్పు ఉండదు.
ఇంటి ముందు ఉండే సంపులతో మరీ జాగ్రత్తగా ఉండాలి. వాటి మూతలు తీసి ఉంటే అందులో పడిపోయే ప్రమాదం ఉంది. మన పనిలో మనం ఉంటే వారు మెల్లగా వెళ్లి అందులో పడితే ప్రాణాలే పోతాయి. ఎప్పుడు కూడా వాటి మూతలు తీసి ఉంచడం శ్రేయస్కరం కాదు. ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలి. బాల్కనీ, పిట్టగోడ, మెట్లు ఎక్కుతూ కింద పడితే గాయాలవుతాయి. పెంపుడు జంతువులతో కూడా పిల్లలు ఉండకుండా చూడాలి. దీంతో అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది.

ఇంట్లో ఉండే పెద్ద ఆట వస్తువులతో ఆడుకునేటప్పుడు ఎవరైనా తోడుండాలి. లేకపోతే వాటితో కూడా ప్రమాదమే ఉంటుంది. దీంతో చిన్న పిల్లలను ఎప్పుడు కూడా గమనిస్తూ వారి వెంట ఉండాలి. వారికి గాయాలు కాకుండా చూసుకోవాలి. లేకపోతే వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడే సూచనలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.