
Anand Mahindra -Ram charan : ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. ఆస్కార్లోకి ఎంట్రీ ఇచ్చింది.. పురస్కారం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఎప్పటికీ ఆ పాట ట్రెండ్ సెట్టింగ్ గానే ఉంది.. అయితే ఈ పాటకు సంబంధించి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులు అందరిని అలరిస్తున్నాయి.. అప్పట్లో ఈ పాటకు చాలామంది డ్యాన్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ పాట వైరల్ గా మారేందుకు తమ వంతు పాత్ర పోషించారు.. ఇలాంటి ఈ పాటకు మహీంద్రా కంపెనీల చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా కాలు కదిపారు.
హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేసింగ్ కార్యక్రమానికి హాజరైన ఆనంద్ మహీంద్రా… హీరో రామ్ చరణ్ ను కలిశారు.. ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు.. అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు కాలు కదిపారు.. ఆ తర్వాత రామ్ చరణ్ ను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా భుజం తట్టారు.
అన్నట్టు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఆనంద్ మహీంద్రా హాజరు కావడానికి ప్రధాన కారణం వీళ్లకు ఫార్ములా రేస్ కు సంబంధించి జట్లు ఉండటమే.. హైదరాబాద్ నగరంలో ఈ రేసు నిర్వహించేందుకు కూడా వీరే ప్రధాన కారణమని తెలుస్తోంది.. పైగా మంత్రి కేటీఆర్ కూడా వీరిద్దరికి దగ్గర వ్యక్తి కావడంతో ఈ రేస్ నిర్వహణకు మార్గం సుగమం అయింది. అన్నట్టు ఈ పోటీలో ఆనంద్ మహీంద్రా, హీరో రామ్ చరణ్ కు చెందిన జట్ల డ్రైవర్లు పాల్గొన్నారు. వారి కంపెనీలను ప్రమోట్ చేసుకునేందుకే ఈవెంట్ కు వచ్చారు.. ఇక రామ్ చరణ్, ఆనంద్ మహీంద్రా చేసిన నాటు నాటు పాటకు చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.