
Late Night Dinner: మనకు సరైన సమయానికి భోజనం చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి రోజు సరైన టైంలోనే భోజనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. అందుకే మన పెద్దవారు సమయానికి తినాలని సూచిస్తుంటారు. ఎటైనా వెళితే వేళకు భోజనం చేయాలని చెబుతుంటారు. ప్రతి రోజు మనకు సరైన తిండి, నిద్ర లేకపోతే మన శరీరం రోగాల మయం కావడం జరుగుతుంది. ఇలా భోజనం విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు.

రాత్రి భోజనం కూడా 8 గంటల లోపు చేయాలి. ఎందుకంటే రాత్రి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయితేనే మనకు మంచి నిద్ర పడుతుంది. భోజనానికి మనం పడుకునే సమయానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలి. లేదంటే నిద్ర పట్టదు. ఒకవేళ నిద్రపోయినా మధ్యలోనే మెలకువ వస్తుంది. అందుకే మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. అందుకే డిన్నర్ త్వరగా పూర్తి చేసుకోవాలి. సాయంత్రం 6.30 లోపు తినడం ఇంకా సురక్షితం.
Also Read: Lizards: ఇంట్లో బల్లులా.. తరిమికొట్టే శాశ్వత పరిష్కారం ఇదీ!
మనం రోజు రాత్రి సమయంలో 8 గంటల లోపు భోజనం చేయకపోతే పొట్టు చుట్టు కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ ముప్పును తప్పించుకోవాలంటే వేళకు భోజనం చేయడమే చక్కని పరిష్కార మార్గం. ఆలస్యంగా భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అల్సర్, ఎసిడిటి వంటి వాటి వల్ల మన దేహం ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. అందుకే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది.
జీర్ణక్రియ సవ్యంగా జరగాలంటే సమయానికి ఆహారం తీసుకోవాల్సిందే. లేదంటే శరీరం రోగాలకు నిలయంగా మారుతుంది. సమయానికి ఆహారం తీసుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. వైద్యులు కూడా రాత్రి పూట డిన్నర్ తొందరగానే పూర్తి చేయాలని చెబుతున్నారు. దీంతో మనం డిన్నర్ త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రాత్రి భోజనం చేయాల్సి ఉంటుంది. రాత్రుళ్లు త్వరగా జీర్ణమయ్యే వాటినే తీసుకోవడం ఉత్తమం. మసాలాలు, మాంసం వంటి వాటిని తీసుకోకపోవడమే శ్రేయస్కరం. రాత్రి భోజనంలో పండ్లు ఉంచుకుంటే మరీ మంచిది.
Also Read: Holi: హోలీ నాడు ఇవి చేస్తే దారిద్ర్యం దూరమవుతుంది తెలుసా?