Chanakya Niti: అపర చాణక్యుడు తన వ్యూహం,ప్రతివ్యూహాలతో మౌర్యగుప్త సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపించాడు. అలాగే వ్యక్తుల్లో ఏర్పడే సమస్యలు, బాధల నుంచి బయటపడడానికి కొన్ని సూత్రాలను చెప్పాడు. చాణక్య నీతి ఫాలో అయిన వారు సక్సెస్ ఫుల్ జీవితాన్ని గడుపుతున్నారు. ఆర్థిక, రాజకీయపరమైన అంశాల్లోనూ విలువైన విషయాలను చాణక్యుడు వెల్లడించాడు. తన నీతి శాస్త్రం ప్రకారం కొన్ని గుణాలు ఉన్న వ్యక్తి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోగలను అని చెప్పాడు. ముఖ్యంగా ఈ మూడు లక్షణాలు కలిగిన వ్యక్తి గొప్పవాడు అవుతాయని చాణక్య నీతిశాస్త్రం తెలుపుతుంది. ఆ మూడు సూత్రాలేవో తెలుసుకుందాం..
లక్ష్యసిద్ది:
జీవితంలో గమ్యం లేని ప్రయాణం వ్యర్థం. ప్రతి ఒక్కరూ తాను అనుకున్న జీవితాన్ని గడపడానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యం ప్రకారం ముందుకు సాగాలి. ఎవరైనా తన లక్ష్యాన్ని తెలుసుకున్నప్పుడు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు.ఈ లక్ష్యం చేరడానికి ఓర్పు,సహనం ఉండాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించుకుంటునే అనుకున్నది సాధిస్తారు.
రిస్క్ తీసుకోవాలి:
లక్స్యాన్ని చేరుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్కోసారి లక్ష్యాన్ని చేరకుండా వ్యక్తులు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంది. అయినా ప్రణాళికతో వారిని మెప్పిస్తూ ముందుకు సాగాలి.ఉద్యోగం లేదా వ్యాపారం చేసేటప్పుడు వారి పనిని మొదలుపెట్టినప్పుడు మొదట్లో అపజయాలు కలుగుతాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సహనంతో ఉండాలి. ఒక్కోసారి తప్పు చేయకపోయినా నింద మీద పడుతుంది. తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ నిర్ణయించుకున్న లక్ష్యం మంచిదే అయితే నష్టాన్ని ఆలోచిస్తూ కూర్చొకుండా రిస్క్ చేసైనా ముందుకు సాగాలి.
నిబద్ధత:
చేసే పనిలో నిబద్ధత కచ్చితంగ ఉండాలి. నిర్లక్ష్యంతో పనులు మొదలు పెడితే అవి పూర్తవవు. అంతేకాకుండా నిర్లక్ష్యంగా చేస్తే పతనానికి దారి తీస్తుంది. ఇలా ఉండడంవల్ల వ్యక్తులకే కాకుండా సంస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఎంత నిజాయితీగా ఉండడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా సంస్థకు కూడా లాభం జరుగుతుంది.
ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తి జీవితంలో ఏ పనినైనా ఈజాగా చేయగలడని, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలడని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు.