Chanakya Neeti: చాణక్య నీతి ప్రకారం.. ఈ 4 సూత్రాలు పాటిస్తే మీ జీవితానికి ఎదరే లేదు..

ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది. డబ్బు ప్రధానంగా పనిచేయాలని కొందరు మాత్రమే అనుకుంటారు. ఆత్మాభిమానం గురించి ఆలోచించేవారు తమకు ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడ ఆనందంగా ఉంటారు.

Written By: Chai Muchhata, Updated On : November 28, 2023 4:14 pm
Follow us on

Chanakya Neeti: అందమైన జీవితం కావాలాని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో సరైన ప్రణాళిక లేకపోవడంతో కష్టాలు ఎదురవుతాయి. మరికొన్ని విషయాల్లో ప్రవర్తనా లోపంతో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. కొన్ని విషయంలో సమయస్ఫూర్తిగా.. తెలివితేటలు ప్రదర్శించడంతో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చని చాణక్య నీతి చెబుతోంది. అపర చాణక్యడి మేథస్సుతో ఎన్నో సమస్యలను పరిష్కరించాడు. అలాగే మానవ జీవితంపై అధ్యయనం చేసి కొన్ని సూత్రాలను అందించాడు. ఆయన చెప్పిన కొన్ని నియమాలను పాటిస్తే జీవితంలో సమస్యలు ఇబ్బంది పెట్టవు. మరి ఆ సూత్రాలేంటో తెలుసుకుందాం..

గౌరవం లేని చోట..
ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది. డబ్బు ప్రధానంగా పనిచేయాలని కొందరు మాత్రమే అనుకుంటారు. ఆత్మాభిమానం గురించి ఆలోచించేవారు తమకు ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడ ఆనందంగా ఉంటారు. అయితే కొన్ని పరిస్థితులకు లోబడి గౌరవం లభించకున్నా పనిచేయాల్సి వస్తుంది. కానీ డబ్బు కన్నా ఆత్మాభిమానం గురించి ఆలోచించేవారు అక్కడ పనిచేయాల్సిన అవసం లేదు. దీంతో మానసికంగా కుంగిపోయి మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఉపాధి..
ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. బతకడానికి ఏదో ఒక పనిచేయాలి. అందువల్ల జీవితం ఆనందంగా గడపడానికి ఉపాధి మార్గాలను వెతుక్కోవాలి. ఉపాధి మనదగ్గరకు రాదు. అది ఉన్నచోటే వెళ్లాలి. చేతులు కట్టుకొని నాకు ఉపాధి కావాలంటే కుదరదు. దాని కోసం వెతుక్కోవాలి. అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తారు.

బంధుగుణం..
సమాజంలో ఆనందంగా ఉండాలంటే స్నేహితులు, బంధువులు ఉన్నచోట ఇల్లు కట్టుకోవడం మంచిది. కష్ట సుఖాల్లో వీరు అందుబాటులో ఉంటారు. ఆపదలో అందుబాటులో ఉంటారు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం ద్వారా జీవితం ఆనందంగా కొనసాగుతుంది.

విద్య..
ఒకప్పుడు చదువు లేకపోయినా జీవితం గడిచింది. కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిందే. చదువు చిన్నది, పెద్దది అని కాకుండా సాధ్యమైనంత వరకు విద్యాబుద్దులు నేర్చుకునేందుకుప్రయత్నించాలి. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది.