Homeలైఫ్ స్టైల్Accidentally Lost JOB: అనుకోకుండా JOB పోయిందా.. ఇలా చేసి కుటుంబాన్ని కాపాడుకోండి..

Accidentally Lost JOB: అనుకోకుండా JOB పోయిందా.. ఇలా చేసి కుటుంబాన్ని కాపాడుకోండి..

Accidentally Lost JOB:అన్ని రోజులూ ఒకేలా ఉండవు. ఇప్పుడు సంతోషంగా ఉన్నవారు.. మరుక్షణంలో బాధపడే పరిస్థితి ఎదురయ్యే రోజులు ఇవి. ముఖ్యంగా డబ్బు విషయంలో ప్రజంట్ కంటే ఫ్యూచర్ అవసరాల కోసం ఎక్కువగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఎంప్లాయ్ నుంచి కొంత అమౌంట్ ను తీసుకొని భవిష్యత్ లో వారి అవసరాలు తీర్చడానికి అందిస్తుంది. దీనినే Provident Fund(PF)అని అంటారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పీఎఫ్ సౌకర్యం ఉండేది. ఆ తరువాత ప్రైవేట్ ఉద్యోగులకు కూడా దీనిని వర్తింపచేశారు. అయితే పీఫ్ లో జమ అయిన మొత్తం 55 సంవ్సరాల తరువాత మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇందులో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు పీఎఫ్ మొత్తాన్ని ఇలాగ కూడా తీసుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రావిడెంట్ ఫండ్ వల్ల ఒక ఉద్యోగికి ప్రయోనమే. తనకు వచ్చే సాలరీలో కొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో సంస్థ అంతే మొత్తాన్ని జమచేస్తుంది. ఈ మొత్తంపై రిటైర్మెంట్ అయిన తరువాత వడ్డీతో సహా కలిపి అందిస్తారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇందులోని నిబంధనలు మార్చారు. ఒకప్పుడు పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే రిటైర్మెంట్ వయసు వచ్చాక వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ముందుగానే 75 శాతం వరకు తీసుకోవచ్చు.

ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగికి భద్రత ఎక్కువగా ఉండదు. దన జాబ్ ఎప్పుడైపో పోవచ్చు. ఈ క్రమంలో తన కున్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో పీఎఫ్ డబ్బును వాడుకోవచ్చు. సాధారణంగా ఒక ఎంప్లాయ్ పనిచేస్తుంటే తనకు సంబంధించిన పీఎఫ్ మొత్తం జమ అవుతూ ఉంటుంది. ఒకవేళ తన జాబ్ పోతే పీఎఫ్ మొత్తం జమ కాదు. దీంతో అతను తన పీఫ్ ను సెటిల్ మెంట్ చేసుకోవచ్చు. అయితే మరో సంస్థకు మారాలని అనుకుంటే.. ఈ పీఎఫ్ ఖాతాను కొనసాగించాలనుకుంటే.. దీనిని అలాగే కొనసాగించవచ్చు. కానీ తాత్కాలికంగా కొంత డబ్బును తీసుకోవచ్చు.

Provident Fund Act ప్రకారం Section 68 HH, Section 69 (2) ప్రకారం.. ఒక వ్యక్తి ఒక నెల కంటే ఎక్కువ రోజులు పీఎఫ్ డబ్బులు చెల్లించకపోయినట్లయితే.. అతను తన పీఎఫ్ మొత్తంలో 75 శాతం వరకు తీసుకోవచ్చు. అలాగే 2 నెలల కంటే ఎక్కువగా గ్యాప్ ఉండడం వల్ల అతని ఫీఎఫ్ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే దీని కోసం సదరు ఉద్యోగికి సంబందించిన డాక్యుమెంట్స్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఒకప్పుడు మాన్యువల్ గా పీఎఫ్ కార్యాలనికి వెళ్లి దరఖాస్తు చేసుకునే వారు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ లోనే పీఎఫ్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా పీఎఫ్ డబ్బులు బ్యాంకులో యాడ్ అవుతాయి. అందువల్ల అనుకోకుండా జాబ్ పోయినట్లయితే ఆందోళన చెందకుండా పీఎఫ్ డబ్బులను ఇలా ఉపయోగిస్తూ ఆర్థికంగా స్థిరత్వాన్ని సంపాదించి కుటుంబాన్ని కాపాడుకోండి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version