Jasprit Bumrah: టీమిండియాను గాయాలు కలవరపెడుతున్నాయి. కీలకమైన ప్రపంచకప్ టీ20 ముందర భారత్ కు భారత్ కు భారీ దెబ్బ తగిలింది. ఆసియా కప్ లో భారత ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యం. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్ర లేకపోవడంతో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ప్రత్యర్థులకు భారీగా పరుగులు ఇవ్వడంతో భారత్ ఓటమి చవిచూసింది.

ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా బుమ్రా, హర్షల్ పటేల్ రావడంతో ఇండియా గాడినపడింది. ఇక ప్రపంచకప్ ముందర మన బౌలింగ్ దళం బాగా మెరుగు అయ్యిందనుకుంటున్న తరుణంలో అనుకోని షాక్ తగిలింది.
టీమిండియా రేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ప్రపంచకప్ టీ20 నుంచి వైదొలగినట్టు తెలిసింది. ప్రపంచకప్ ముందు భారత్ కు ఇది భారీ షాక్ గా చెప్పొచ్చు. వెన్ను నొప్పి కారణంగా టోర్నీ నుంచి పేసర్ తప్పుకుంటున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇటీవలే మోకాలి గాయం కారణంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా దూరమయ్యాడు. ఇప్పుడు కీలక ప్రపంచకప్ ముందుర బుమ్రా దూరం కావడం భారత బౌలింగ్ దళానికి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. డెత్ ఓవర్లలో యార్కర్లతో విరుచుకుపడే బుమ్రా లేకపోవడంతో టీమిండియాకు ఖచ్చితంగా భారీ లోటు. అతడిని భర్తీ చేయడం ఏ బౌలర్ తో సాధ్యం కాదు. దీంతో ప్రపంచకప్ లో టీమిండియా బౌలింగ్ దళానికి తిప్పలు తప్పవన్న చర్చ సాగుతోంది.
Also Read: Kajal Aggarwal- Pushpa-2: పుష్ప-2లో కాజల్ అగర్వాల్.. ఒక్క సాంగ్ కోసం అంత డబ్బు ఇస్తున్నారా…!
[…] […]