Virat Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లి. అద్భుతమైన విజయాలు సాధించి జట్టుకు ఎంతో విలువ తెచ్చాడు. కానీ ఇటీవల ఎందుకో ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. జట్టులో ఫామ్ కోసం పాకులాడుతున్నాడు. ఎప్పటికప్పుడు ఇక విరాట్ పని అయిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తూనే ఉన్నాయి. అయినా ఏదో చిన్న ఆశ విరాట్ మళ్లీ విజృంభిస్తాడని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సైతం ట్వీట్ చేయడం అంటే అతడిపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఓ ధోనిని ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ వీడియో పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ధోనీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేయడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధోనీకి తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటున్నాడు. ధోనీతో కలిసి ఉన్న మధుర క్షణాలను నెమరువేసుకుంటున్నాడు. తన ఎదుగుదలకు అద్భుతమైన క్షణాలు అంటే ధోనీతో కలిసి ఉన్నవేనని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ధోనీ, కోహ్లి కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.
ధోనీ జెర్సీ 7, కోహ్లి జెర్సీ 18 దీంతో 7+18 అంటే తనకు ఇష్టమని చెబుతున్నాడు. తనకు జీవితంలో సంతోషమైన మధుర క్షణాలు ఏవైనా ఉన్నాయంటే అది తనకు ధోనీతో కలిసి ఉన్నవే అంటూ ట్వీట్ చేశాడు. దీంతో కోహ్లి ఇలా ఎందుకు చేస్తున్నాడనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ధోనీతోనే తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెబుతున్నాడు. కోహ్లి, ధోనీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది. అయినప్పటికి కోహ్లి ఇలా స్పందించడంపై పలు సందేహాలు వస్తున్నాయి.

ధోనికి నమ్మదగిన డిప్యూటీగా ఉండడమే నా కెరీర్ లో నేను అస్వాధించిన అద్భుత క్షణాలు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. దీన్ని రోహిత్ కు కౌంటర్ గా కొందరు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే కోహ్లీకి డిప్యూటీగా రోహిత్ శర్మ ఉన్నాడు. కానీ వీరిద్దరి మధ్య సఖ్యత లేదు. కోహ్లీని దించేసి రోహిత్ కెప్టెన్ అయ్యారు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి బలవంతంగా దించేసారని అప్పట్లోనే ఆరోపించారు. ఈ క్రమంలోనే ధోనిని పొగడడం ఓ రకంగా రోహిత్ శర్మను దెప్పిపొడవడమేనని కొందరు కామెంట్ చేస్తున్నారు.
కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించే సన్నాహాల్లో ఉన్నాడా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి ట్వీట్ పై ఫ్యాన్స్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. కోహ్లి ఫామ్ కోల్పోవడంతోనే నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇలా ట్వీట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తన మనుగడపై అతడికే అనుమానాలు వస్తున్న సందర్భంలో ఈ మేరకు ట్వీట్లు చేస్తూ రిటైర్మెంట్ పై పలు రకాలుగా కామెంట్లు వస్తున్నాయి. త్వరలో క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదిఏమైనా విరాట్ కోహ్లి భవితవ్యం డోలాయమానంలో పడుతున్న సందర్భంలో ఆయన మాటలకు పలు కోణాల్లో కామెంట్లు రావడం తెలిసిందే.