
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.