
ఉద్యోగాల భర్తీ విషయంలో మోసం చేసినందుకు నిరుద్యోగ యువత, విద్యార్థులు జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ అసత్యాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల భవిష్యత్తు తరాలు ఉద్యోగాలు లేక తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. గోబెల్స్ ప్రచారం తరహాలోనే జగన్ విధానాలున్నాయని యనమల ఆక్షేపించారు. తన సొంత మీడియా గోబెల్స్ ప్రచార సాధనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.