
భారత అగ్రశేణి రెజ్లర్ భజరంగ్ పునియా తిరుగలేని ఫామ్ కొనసాగిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్ లో పతకానికి చేరువ అవుతున్నాడు. 65 కిలోల విభాగంలో సెమీస్ కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో ఇరాన్ కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1 తేడాతో ఓడించాడు. పిన్ డౌన్ సాయంతో ప్రత్యర్ధిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. కేవలం 4.46 నిమిషాల్లోనే పోరు ముగించాడు. సెమీస్ లో అజర్ బైజాన్ కు చెందిన అలియెవ్ హజీతో తలపడనున్నాడు. అతడు ఒలింపిక్స్ విజేతే కాకుండా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ గెలిచాడు. రెండేళ్ల క్రితం జరిగిన ప్రొ రెజ్లింగ్ లో అతడిని భజరంగ్ ఓడించాడు.