కరోనా వైరస్ వాక్సిన్ ను తమ ప్రజలకు ఇవ్వడానికి WHO అనుమతించినట్లు చైనా తాజాగా ఒక ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం అడ్వాన్స్ దశలో వున్నా వాక్సిన్ ను అత్యవసర కార్యక్రమం కింద ప్రజలకు ఇవ్వడానికి జూన్ చివరి వారంలోనే చైనా స్టేట్ కౌన్సిల్ అనుమతించిన విషయాన్నీ WHO కు తెలపగా వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఆమోదించినట్లు తెలిపారు. చైనాలో చైనా జాతీయ బయోటెక్ గ్రూపు అభివృద్ధి చేస్తున్న రెండు వాక్సిన్ లు, సినోవాక్ అభివృద్ధి చేస్తున్న టీకాలను అత్యవసర కార్యక్రమం కింద ఉపయోగిస్తున్నారు.