Telangana Reservations: రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా అమలు చేసే దిశగా కీలక ముందడుగు వేసింది తెలంగాణ సర్కార్. బీసీ రిజర్వేషన్లనతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకోసం 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది.