Homeఆంధ్రప్రదేశ్‌ambati rambabu : అప్పుడు లేచిన నోరు.. ఇప్పుడు ఎందుకు?!

ambati rambabu : అప్పుడు లేచిన నోరు.. ఇప్పుడు ఎందుకు?!

ambati rambabu : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు స్థానం ప్రత్యేకం. ఆయన ఒక్కరే కాదు నోరున్న నేతలదంతా ప్రత్యేకమే. జగన్మోహన్ రెడ్డి వద్ద వారిది ప్రత్యేక స్థానమే. అయితే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి భక్తుడు. ఆయన గురించి నోటికి ఎంత వస్తే అంత మాట అనేసి నేత. అటువంటి అంబటి రాంబాబు జైలుకు వెళ్తే.. సాటి దూకుడు కలిగిన.. బూతు నేతలంతా ఇప్పుడు మాట్లాడడం మానేశారు. కనీసం అంబటి కోసం ప్రత్యేక ప్రకటన చేసేందుకు కూడా వారు ముందుకు రావడం లేదు. అయితే మాట్లాడితే ఏదైనా జరుగుతుంది అన్న భయమా? లేకుంటే ఎందుకు వచ్చింది గొడవ అంటూ పక్కకు తప్పుకున్నారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది.

* కొడాలి నాని గుప్ చప్..
గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఏమైనా అన్నా.. లేకుంటే చంద్రబాబును ఎవరైనా పొగిడినా తట్టుకోలేకపోయేవారు కొడాలి నాని. వయసుతో సంబంధం లేకుండా చంద్రబాబును వాడు వీడు అంటూ విరుచుకు పడేవారు. లోకేష్ ను ఒక మనిషిగా కూడా చూసేవారు కాదు. అయితే వీరిని పక్కన పెడదాం మెగాస్టార్ చిరంజీవి పకోడీ అంటూ ఎద్దేవా చేసిన మనస్తత్వం ఆయనది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ శరీర ఆకృతిని తక్కువ చేసి మాట్లాడిన హీనబుద్ధి ఆయనది. అయితే ఇప్పుడు సంస్కారం నేర్చుకున్నారో.. లేక భయమో తెలియదు కానీ.. తన సహచరుడైన అంబటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు కొడాలి నాని.

* సౌండ్ లేని వల్లభనేని..
తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వల్లభనేని వంశీ మోహన్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి సభ్యత, సంస్కారాన్ని మరిచి రాజకీయాలకు సంబంధం లేని మహిళలను చట్టసభల్లో అవమానించి దారుణంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు పార్టీ ఇంతలా రోడ్డు ఎక్కి హంగామా చేస్తున్న కనీసం మీడియా ముందుకు కనిపించడం లేదు వంశి. ఇక కాకినాడ అడ్డా.. ఎవరు వస్తారో చెప్పు బిడ్డా అని వీరంగం చేసే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా కనీసం సౌండ్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ ను భీమవరంలో ఓడించాను.. నా ముందు ఆయన ఒక బచ్చా అంటూ విర్రవీగే వారు గ్రంధి శ్రీనివాస్. ఆయన కూడా ఇప్పుడు సోదిలో లేకుండా పోయారు. ఒకరా ఇద్దరా సో కాల్డ్ నాయకులు ఇప్పుడు వైసీపీ ప్రతిచర్యలో కనీసం స్పందించడం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు కూడా సైలెన్స్ పాటిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version