
దేశవ్యాప్తంగా శనివారం నుంచి మడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీం కోర్టు. ఒకే వ్యాక్సిన్ కు రెండు ధరలు ఎందుకని ప్రశ్నించింది. ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు అన్నింటినీ కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు ? కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు ధరలు ఎందుకు ఇందులో హేతుబద్ధత ఏంటి అని శుక్రవారం కేంద్రాన్ని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం.