
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోందని, అన్ని ఆస్పత్రుల నుంచి ఆర్తనాదాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తమకు ప్రతిరోజూ 976 టన్నుల ఆక్సిజన్ అవసరమని తాము ఇప్పటికే కోర్టులకు, కేంద్రానికి కూడా తెలియజేశామన్నారు. కానీ తమకు కేవలం 490 టన్నుల మాత్రమే దొరుకుతోందని శనివారం కేవలం 312 టన్నుల ఆక్సిజన్ మాత్రమే లభించిందని పేర్కొన్నారు. ఇంత తక్కువ స్థాయిలో ఆక్సిజన్ సరఫరా చేస్తే తాము ఎలా ప్రజలకు కాపాడగలమని సూచిగా ప్రశ్నించారుజ.