
ప్రజల సంక్షేమం కోసం జూలై 8న కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన షర్మిల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించనున్నట్లు ఆమె తెలిపారు. పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలని ప్రతిబిడ్డ ఒప్పుకొనేలా ఉండాలన్నారు.