
కరోనా పరిస్థితుల్లో ఆపదలో ఉన్న అభాగ్యులను కాపాడేందుకు ఎల్లప్పుడూ ముందుంటున్నాడు సినీ నటుడు సోనూ సూద్. అతడిని ప్రజలు ఇప్పుడు దేవుడు, రియల్ హీరో అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. అలాంటి సోనూ సూద్ ను కలిసేందుకు వికారాబాద్ జిల్లాలోని దోమ మండల పరిదిలోని దోర్నాలప్లి గ్రామానికి చెందిన వెంకటేష్ పాదయాత్రగా వెళ్లి గురువారం సాయంత్రం ముంబైలో అతడిని కలిశాడు. సోనూ సూద్ చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితులై సంఘీభావం తెలుపుతూ ఇక్కడి నుంచి ముంబైకి 700 కిలోమీటర్లు పాదయాత్ర తో వెళ్లి కలిసినట్లు వెంకటేశ్ తెలిపాడు.