https://oktelugu.com/

Virat Kohli : విరాట్ ఒక్క సెంచరీతో 14,000 పరుగులు.. ఏకంగా దిగ్గజాల రికార్డులు గల్లంతు..

Virat Kohli ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో భారత జట్టు పాకిస్తాన్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా గ్రూపు - ఏ లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే మ్యాజిక్ ను పాకిస్తాన్ జట్టుపై రిపీట్ చేసింది.

Written By: , Updated On : February 23, 2025 / 10:27 PM IST
Virat Kohli

Virat Kohli

Follow us on

Virat Kohli : పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ భారత్ విజయం సాధించింది. ఈ గెలుపులో టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ముఖ్యపాత్ర పోషించాడు. చాలా రోజుల తర్వాత సెంచరీ చేసి జట్టు విజయంలో ముఖ్య భూమిక వహించాడు. సెంచరీ చేయడం ద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో 14 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనత సాధించిన మూడవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2008లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే సూపర్బ్ బ్యాటింగ్ తో విరాట్ కోహ్లీ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. సచిన్ తర్వాత టీమ్ ఇండియాలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా ఆవిర్భవించాడు. అంతేకాదు వన్డే క్రికెట్ ఇంటర్నేషనల్ లో సచిన్, కుమార సంగక్కర తర్వాత ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.. 298 వన్డే మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 73 హాఫ్ సెంచరీలు చేశాడు. ద్వారా ఈ ఫార్మేట్ లో 50 సెంచరీలను నమోదు చేశాడు. 36 సంవత్సరాల వయసు ఉన్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ లో రికార్డులు సృష్టించడం ఇదే తొలిసారి కాదు. 2023 లో జరిగిన మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.. మొత్తంగా 11 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సంచరులతో 765 పరుగులు చేశాడు.. అంతే భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ని కూడా అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో 50 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ నిలిచాడు.

సెంచరీ చేశాడు..

విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత సెంచరీ చేశాడు.. ఇటీవల కాలంలో అతడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతనిపై విమర్శలు పెరిగిపోయాయి. రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందని ఉచిత సలహాలు ఇవ్వడం కూడా ఎక్కువైపోయింది. దీంతో తనను తాను సాన పెట్టుకున్న విరాట్ కోహ్లీ.. చివరికి అద్భుతమైన ఫలితాన్ని సాధించాడు. దాయాది జట్టుపై తిరుగులేని స్థాయిలో సెంచరీ చేసి.. భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయం ద్వారా టీమిండియా దాదాపు సెమీఫైనల్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది. అయితే ఇదే దశలో పాకిస్తాన్ జట్టు రెండు వరుస ఓవటములతో టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించే స్థితికి చేరుకుంది. పాకిస్తాన్ సెమి ఫైనల్ చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి. కానీ అలా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. విరాట్ దుబాయ్ లో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో.. పాకిస్తాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కేవలం 241 పరుగులు మాత్రమే చేయడంతో.. టీమిండియా ఎదుట భారీ లక్ష్యం అంటూ లేకుండా పోయింది. దీనికి తోడు విరాట్ కోహ్లీ దూకుడు కొనసాగడంతో భారత్ త్వరగానే విజయం సాధించింది.. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో తన సెమీఫైనల్ ప్రస్తానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.