Virat Kohli IPL 2026 : మహిళా రిజర్వేషన్, లోక్‌సభ స్థానాల డీలిమినేషన్ బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశం గురువారం(ఏప్రిల్ 16న) నిర్వహించారు. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ ఐడియా’ను “ఫూలిష్” అని తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన భారత్-పాకిస్తాన్ విభజన కంటే ఘోరమని, బ్రిటిష్‌ల కంటే కాంగ్రెస్ మరింత దారుణంగా చేసిందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.
చిన్న వయసులోనే ఎంపీ..
1990 నవంబర్ 16న బెంగళూరులో జన్మించిన తేజస్వి సూర్య(34 సంవత్సరాలు) దేశంలోనే అతి పిన్న వయస్కుడైన లోక్‌సభ సభ్యుడు. బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి 2019, 2024 ఎన్నికల్లో రెండుసార్లు ఎంపీగా గెలిచాడు. బీజేపీ యువజన విభాగం (బీజేవైఎం) అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా శిక్షణ పొంది, చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నాడు.
రాజకీయ కుటుంబం..
తేజస్వి తండ్రి ఎల్‌ఎ శూర్యనారాయణ (ఎక్సైజ్ జాయింట్ కమిషనర్), మామ ఎల్‌ఎ.రవి సుబ్రమణ్యం (బసవగుడి బీజేపీ ఎమ్మెల్యే) కుటుంబ రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నాడు. బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ అకాడమిక్ లా-ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. ఈ నేపథ్యం పార్లమెంట్ చర్చల్లో తీక్షణ వాదనలకు సహాయపడుతుంది.
అనంత్ కుమార్ వారసత్వం..
బీజేపీ సీనియర్ నేత దివంగత అనంత్ కుమార్ స్థానాన్ని తేజస్వి సూర్య భర్తీ చేశాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండి, యువతను ఆకర్షించి ఘన విజయం సాధించాడు. 2024లో రెండోసారి గెలిచి, బీజేపీకి యూత్ ఫేస్‌గా ఎదిగాడు.
భారీగా పెరిగిన ఆస్తులు..
2024 అఫిడవిట్ ప్రకారం, తేజస్వి సూర్యకు రూ.4.10 కోట్ల ఆస్తులు ఉన్నాయి (2019 అఫిడవిట్‌లో కేవలం రూ.13.46 లక్షలు). స్థిరాస్తులు లేకపోయినా, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.1.99 కోట్లు, షేర్లలో రూ.79 లక్షలకు పైగా పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు. అప్పులు లేవు. అయితే 5 సంవత్సరాల్లో తేజస్వి ఆస్తులు 30 రెట్లు పెరగడం చర్చనీయాంశమైంది.
తేజస్వి సూర్య రాజకీయ శైలి, సోషల్ మీడియా వాడకం బీజేపీకి యూవా ఫేస్‌గా నిలిచాయి. ఏపీ విభజన వ్యాఖ్యలు వివాదాస్పదమైనా, పార్టీ స్ట్రాటజీలో తీవ్ర వాదనలు ఆయన బలం. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, న్యాయవాద పరిజ్ఞానం, ఆస్తుల పెరుగుదల అన్నీ ఆయన రైజ్‌కు కారణాలు. రేవంత్ విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో చర్చించబడుతున్నాయి.