
ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శరద్ యాదవ్ విషయంలో నోటీసులు ఇచ్చి వారం రోజుల్లోనే అనర్హత వేటు వేశారని చెప్పారు. వైసీపీ ఏడాది క్రితం అనర్హత పిటిషన్ ఇస్తే 11 నెలల తర్వాత స్పీకర్ నిద్ర లేచారని చెప్పారు. ఉద్దేశ్య పూర్వకంగా కాలయాపన చేస్తూ కొద్దీ రోజుల క్రితం పిటిషన్ లో లోపాలు ఉన్నాయి సరి చేయమని పంపారని పేర్కొన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని విజయసాయి మండిపడ్డారు.