Rowdy Janardhana Teaser : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా, సరైన సినిమాలు పడక వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను ఎదురుకుంటున్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఆయన నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ ఇప్పటి వరకు రాలేదు. ఈ ఏడాది ఆయన నుండి ‘కింగ్డమ్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన పూర్తి మేక్ ఓవర్ అయ్యి చేస్తున్న చిత్రం ‘రౌడీ జనార్ధన'(Rowdy Janardhana). దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. గతం లో ఈయన ‘రాజా వారు..రాణి వారు’, ‘ఆకాశవనంలో అర్జున కళ్యాణం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు.
అయితే నేడు ‘రౌడీ జనార్ధన’ టీజర్ ని మేకర్స్ విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గెటప్ చాలా కొత్తగా అనిపించింది. ఇంత ఊర మాస్ లుక్ లో ఆయన కెరీర్ మొత్తం మీద కనిపించలేదు. అంతే కాకుండా తన ప్రతీ సినిమాలోనూ తెలంగాణ యాస తో మాట్లాడే విజయ్ దేవరకొండ, ఈ చిత్రం లో మాత్రం గోదావరి యాసలో మాట్లాడినట్టు గా టీజర్ ని చూస్తే అర్థం అవుతోంది. కానీ ఆ యాస ఆయనకు అంతగా సూట్ అవ్వలేదని అంటున్నారు నెటిజెన్స్. కానీ టీజర్ మాత్రం మంచి ఇంటెన్స్ గా ఉందని, ఈసారి టార్గెట్ మిస్ అయ్యేలా లేదని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఈ టీజర్ లోని ఒక డైలాగ్ బాగా పేలింది. ‘ఊర్లో ఉన్న ప్రతీ ల***కొడుక్కి రౌడీ అవ్వాలని ఉంటుంది..కానీ రౌడీ నే ఇంటి పేరు గా మార్చుకుంది నేను మాత్రమే..రౌడీ జనార్ధన’ అంటూ ఆయన ఎమోషన్ తో చెప్పే డైలాగ్ బాగానే పేలింది.
కానీ విజయ్ దేవరకొండ కి ఇలాంటి యాక్షన్ సినిమాలు ఎంతమేరకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాలి. ‘ది కింగ్డమ్’ చిత్రం డీసెంట్ గానే ఉంటుంది. భారీ హైప్ తో వచ్చిన ఆ సినిమా డీసెంట్ గా ఉన్నప్పటికీ సూపర్ హిట్ అవ్వాలి, కానీ అలా జరగలేదు. ఇప్పుడు మళ్లీ అదే యాక్షన్ జానర్ లో సినిమా అంటే, ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒకవేళ ఈ సినిమా పెద్ద హిట్ అయితే, విజయ్ దేవరకొండ కి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదేమో. ఈ చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నాడని ఒక టాక్ వినిపించింది కానీ, ఇప్పుడు తమిళ హీరో విజయ్ సేతుపతి ని విలన్ క్యారక్టర్ కోసం అడుగుతున్నారట. చూడాలి మరి ఆయన ఇందులో నటించడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది.