Ranabali Movie : ‘కింగ్డమ్’ వంటి భారీ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ చేస్తున్న మరో భారీ చిత్రం ‘రణబలి’. ‘టాక్సీ వాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా విజయ్ దేవరకొండ కాబోయే సతీమణి రష్మిక మందాన నటిస్తోంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. నేడు రిపబ్లిక్ డే సందర్భంగా కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ ఆడియన్స్ ని ఎంతో సర్ప్రైజ్ కి గురి చేసింది. విజయ్ దేవరకొండ నుండి ఈ రేంజ్ కంటెంట్ ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గ్లింప్స్ ప్రారంభం లో ‘ఇది మన భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అని చెప్పబోతున్న కథ కాదు, దానికంటే ముందు ప్రపంచం చూడని ఒక చీకటి నిజాన్ని చూపించే స్టోరీ’ అంటూ కొన్ని ఆసక్తికరమైన విజువల్స్ ని చూపిస్తారు. బ్రిటీషులు చేసిన అకృత్య సంఘటనలలో ప్రపంచం చూడని ఒక నిజాన్ని చూపించబోతున్నాం అంటూ ఈ గ్లింప్స్ లో చెప్పుకొచ్చారు. బ్రిటిషులు మన ఇండియా నుండి 43 ట్రిలియన్ డాలర్స్ ని దోచుకున్నారు, ఎన్నో లక్షల మంది ప్రాణాలను తీసుకున్నారు,వీళ్లల్లో నుండి పుట్టిన ఒక యువకుడు, బ్రిటిష్ సైన్యం తో వీరోచితంగా పోరాడిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసినట్టు చెప్పుకొచ్చారు. గ్లింప్స్ చివర్లో విజయ్ దేవరకొండ రైలు పట్టాల మీద గుర్రం పై స్వారీ చేస్తూ, తన చేతిలో బ్రిటీషోడి మెడకు చుట్టిన తాడుని ఈడ్చుకుంటూ రావడం గ్లింప్స్ లో హైలైట్ గా నిల్చింది.
సినిమా కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ, ఎందుకో విజయ్ దేవరకొండ కి ఈ క్యారెక్టర్ సూట్ కాలేదు అనే కామెంట్స్ సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు అజయ్, అతుల్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు మ్యూజిక్ అందించిన చరిత్ర వాళ్ళది. వాళ్ళు ఈ సినిమాకు పని చేయడం హైలైట్ అని చెప్పొచ్చు. ఈ గ్లింప్స్ వీడియో కి కూడా అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ ని అందించారు. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ నుండి రౌడీ జనార్ధన మూవీ టీజర్ విడుదలై ఫుల్ ట్రోల్స్ కి గురైంది. ఆ టీజర్ కంటే, ఈరోజు విడుదలైన రణబలి గ్లింప్స్ బాగుందని అంటున్నారు. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి.
The man who became a LEGEND for his people.
The legend who became a NIGHTMARE for the evil.His name is #RANABAALI
Watch the glimpse here▶️https://t.co/tK8k7e1vPr
Grand release worldwide on September 11th #VD14@TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn… pic.twitter.com/AwHziuEr7I
— Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2026