
సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూముల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. సింహాచలం భూములను ఆస్తుల రిజిస్ట్రీ నుంచి తొలిగించడం, మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. మాన్సాస్ ట్రస్ట్ కు చెందిన భూముల విక్రయాల్లో అక్రమాలు, తదితరాల ద్వారా రూ. 74. 72 కోట్ల మేర నష్టం కలిగించారని పేర్కింటూ గతంలో దేవస్థానం ఈవోగా చేసిన రాచంద్రమోహన్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు విధించిన సంగతి తెలిసిందే.