Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నలుగురు నాలుగు పిల్లర్లుగా సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. సీనియర్ హీరోలుగా ముందుకు దూసుకెళుతున్న వాళ్లు ఒకప్పుడు పెను సంచలనాలను క్రియేట్ చేశారు. వాళ్ల నుంచి ఒక సినిమా వస్తుందంటే అది పక్కాగా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమానే అంటూ ప్రేక్షకులైతే నమ్మేవారు. అలాంటి హీరోలు ఈ మధ్యకాలంలో మాస్ కమర్షియల్ సినిమాలపై అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ అయితే కామెడీ సినిమాలతోనే ముందుకు సాగుతున్నాడు. అలా కాకుండా వెంకటేష్ అద్భుతమైన నటుడని అతను ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలుగుతాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విక్టరీ వెంకటేష్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు అతనికి మంచి విజయాలను కట్టబెడుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన ఆయన ఇప్పుడు చేయబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మరింత ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి తో మరోసారి జత కడుతున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా ఫ్యామిలీ కామెడీ జానర్ లోనే తెరకెక్కుతుందని తెలుస్తుంది.
ఇక ఇలా కాకుండా వెంకటేష్ డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించగలిగితే బాగుంటుందని మలయాళంలో మోహన్ లాల్ డిఫరెంట్ సినిమాలను చేస్తున్నాడు. అతని తరహాలోనే వెంకటేష్ కూడా అలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ లను, సీరియస్ జానర్ లో ఉన్న సినిమాలు చేస్తే అతనికి ప్రేక్షకుడి నుంచి మంచి గుర్తింపు వస్తుంది. అలాగే సినిమాలు కూడా బాగా ఆడతాయని, కొత్తదనాన్ని పరిచయం చేసిన వాళ్లవుతారంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
విక్టరీ వెంకటేష్ సైతం అలాంటి సబ్జెక్టుల కోసం ఎదురుచూస్తున్నాడట. కానీ తన దగ్గరికి వచ్చిన దర్శకులు కేవలం కామెడీ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకొని వస్తున్నారని దానికి తను చేసేది ఏమీ లేక ఆ కథలను ఒప్పుకొని సినిమాలుగా చేస్తున్నానని దానికి ప్రేక్షకులు ఆదరిస్తున్నారని కూడా చెబుతున్నాడు.
ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని కానీ దర్శకులు తనతో ప్రయోగాలు చేయించడానికి రెడీగా ఉన్నారా? లేదా అంటూ వాళ్ళకే సవాళ్లను విసురుతున్నాడు. అతని సవాళ్లను స్వీకరించి ఎవరైనా దర్శకుడు కొత్త కాన్సెప్ట్ తో కథను రెడీ చేసి అతని దగ్గరికి తీసుకెళ్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
