Uttar Pradesh police exam : శీర్షిక చదివి ఇదేదో పెద్దల కంటెంట్ అనుకునేరు. బూతు పదమని అనుకునేరు. అలా రాయాల్సిన ఉద్దేశం మాకు లేదు. చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది ముమ్మాటికి చదవాల్సిన కథనం. అర్థం చేసుకోవాల్సిన విషయం.
మనదేశంలో అతిపెద్ద రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ ఒకటి. ప్రస్తుతం అక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక పరీక్షలు జరుగుతున్నాయి.. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాబట్టి సహజంగానే నిరుద్యోగ సమస్య అధికంగా ఉంటుంది. పైగా చాలా రోజుల తర్వాత అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో భారీగానే నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.. ఇప్పటికే శారీరక దారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. రాత పరీక్షలు నడుస్తున్నాయి. రాత పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పరీక్ష నిర్వహిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. విమర్శలకు దారితీస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్ పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో నిర్వహించిన తనిఖీలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. అక్కడ డిటెక్టర్ తో ప్రతి అభ్యర్థిని తనిఖీ చేస్తున్నారు. ఒక అభ్యర్థి తన అండర్వేర్లో ఫోన్ పెట్టుకుని వచ్చాడు. అది కాస్త డిటెక్టర్ ద్వారా చేసిన తనిఖీల్లో బయటపడింది. దీంతో అభ్యర్థులను ముందుగా అండర్వేర్లో డిటెక్టర్ పెట్టి పరీక్షిస్తున్నారు. ఆ తర్వాత దానిని నోట్లో కూడా పెడుతున్నారు. అండర్వేర్ నుంచి నోరు వరకు దేనిని వదలకుండా డిటెక్టర్ పెడుతుండడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి నోరు మెదపకపోయినప్పటికీ.. ఉద్యోగం కావాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దానిని తట్టుకుంటున్నారు.
“ఉద్యోగం సాధించాలంటే కష్టపడాలి. అందులో తప్పులేదు. కానీ ఇలా అండర్వేర్ లో డిటెక్టర్ పెట్టి మళ్ళీ దానిని నోట్లో పెడితే దానిని ఏమనుకోవాలి.. అసలు ఇలా తనిఖీ చేస్తారా.. దీనిని తనిఖీ అంటారా.. ఇంతగనం ఇబ్బంది పెడితే ఎలా పరీక్ష రాయాలి. పరీక్ష రాయడానికి వచ్చిన వారంతా కూడా పేద, మధ్య తరగతివారే. వారికి ఉద్యోగం కావాలి కాబట్టి ఇదంతా భరిస్తున్నారు. కానీ ఇంత ఇబ్బంది పడుతూ ఉద్యోగం సాధించడం అవసరమా అనిపిస్తోందని” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Officials amped up the entry protocol for a UP police constable recruitment exam in Uttar Pradesh. pic.twitter.com/m70eAHjT3v
— Brut India (@BrutIndia) June 12, 2026

