uppal stadium issues : “వేల రూపాయలు ఖర్చుపెట్టి టికెట్లు కొనుగోలు చేశాం. అభిమాన ఆటగాళ్ల ఆట తీరు చూడాలని ముందుగానే వచ్చాం. ఎండను సైతం లెక్క చేయలేదు. కనీసం సన్ గ్లాసెస్ ధరిస్తామని చెప్పినా కూడా వినిపించుకోలేదు. మైదానం లోపలికి వచ్చి చూస్తే సీట్లు మొత్తం దారుణంగా ఉన్నాయి. దుమ్ము ధూళితో అధ్వానంగా ఉన్నాయి. తప్పదు కాబట్టి చేతిలో ఉన్న కర్చీఫ్ తో దుమ్ము మేమే దులిపేసుకున్నాం. పక్షుల రెట్టల తో చాలా దుర్గంధమైన వాసన ఉంది. ఇలాంటి స్థితిలో మ్యాచ్ చూడాలంటే ఇబ్బందిగా ఉంది. నిర్వాహకులకు కనీసం కూడా స్పృహ లేదు” ఇవీ ఉప్పల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానుల మాటలు.
హైదరాబాద్ క్రికెట్ యూనియన్ మొదటి నుంచి కూడా కమర్షియల్ గానే ఆలోచిస్తూ ఉంటుంది. మైదానంలో కనీస సౌకర్యాలు ఉండవు. హైదరాబాద్ క్రికెట్ యూనియన్ పెద్దలు మాత్రం ఐపీఎల్ జరిగినప్పుడు టికెట్ల కోసం గొడవకు దిగుతారు. తాము కోరిన టికెట్లు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు పాల్పడతారు. గత ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టుకు.. హైదరాబాద్ క్రికెట్ యూనియన్ కు జరిగిన గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ క్రికెట్ జట్టు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా తమకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించడంతో.. ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగి.. విచారణకు ఆదేశించారు. నాడు బెదిరింపులకు పాల్పడిన హైదరాబాద్ క్రికెట్ యూనియన్ పెద్దలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
ఇంతటి దారుణం జరిగిన తర్వాత కూడా హైదరాబాద్ క్రికెట్ యూనియన్ మారలేదు. తన తీరు మార్చుకోలేదు. హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్లో చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరుగుతున్న క్రమంలో.. అభిమానులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన చోట.. చేతులెత్తేసింది. కనీసం సీట్లను శుభ్రం చేయాలనే తలంపు కూడా హైదరాబాద్ క్రికెట్ యూనియన్ కు లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు..
హైదరాబాద్ స్థాయిలో సౌకర్యాలు లేకపోయినప్పటికీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ క్రికెట్ మైదానం అంతర్జాతీయంగా ఖ్యాతిని పొందుతోంది. ఈ మైదానంలో ఇటీవల కాలంలో వరుసగా అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి. చివరికి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు కూడా జరిగాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ గట్టిగా చొరవ తీసుకోవడంతో విశాఖ క్రికెట్ మైదానం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ఉన్న ఒక్క ఉప్పల్ మైదానంలో మ్యాచులు జరగడమే గగనంగా మారింది. బీసీసీఐ పెద్దలతో సంప్రదింపులు జరిపే వారే లేకుండా పోయారు. మ్యాచ్లు జరిగినప్పుడు కనీసం సక్రమంగా నిర్వహించేవారు కూడా కరువైపోయారు. ఒకప్పుడు నిత్యం మ్యాచులు.. అభిమానుల సందడితో కళకళలాడే ఉప్పల్ మైదానం.. ఇప్పుడు కళా విహీనంగా మారిపోయింది.. దీని అంతటికి హైదరాబాద్ క్రికెట్ యూనియన్ నిర్లక్ష్యం ఒక కారణమైతే.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరో కారణం.
బ్రేకింగ్ న్యూస్
ఉప్పల్ స్టేడియంలో స్టేడియంలో దుమ్ముతో నిండిన సీట్లు.. ప్రేక్షకుల ఇబ్బందులు
తమతో పాటు తెచ్చుకున్న కర్చీఫ్ లతో స్వయంగా క్లీన్ చేసుకున్న అభిమానులు
స్టేడియంలో ఏర్పాట్లపై ఫ్యాన్స్ అసంతృప్తి
సన్ గ్లాసెస్ అనుమతించకపోవడంతో చేసేదేం లేక సన్ గ్లాసెస్ బయటే పడేసి లోపలికి… pic.twitter.com/nZLCzcS7s2
— TNews Telugu (@TNewsTelugu) April 5, 2026