
మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 1 నుంచి లాక్ డౌన్ ఎత్తివేయడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మార్గదర్శకాలను కూడా వెల్లడించారు. కిరాణా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వగా పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, మాల్స్ మూసివేత కొనసాగుతుంది. ప్రతి శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.