కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. కేంద్ర మంత్రికి ఈ ఏడాది ఏప్రిల్ కరోనా సోకింది. కొద్ది రోజులకు నెగిటివ్ నిర్ధారణ అయినప్పటికీ ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. రమేశ్ పోఖ్రియాల్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియాల్సి ఉంది.