మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రికి చెంప దెబ్బ అని ఆయన అన్నట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో, వీటిని రద్దు చేయాలని కోరుతూ ఆయన బోంబే హైకోర్టును ఆశ్రయించారు. జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న్ నారాయణ్ రాణేను మంగళవారం రత్నగిరి పోలీసులు అరెస్టు చేశారు. రాణే తరఫున అడ్వకేట్ అనికేత్ నికమ్ బోంబే హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. రాణేపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని కోరారు. ముందస్తు బెయిల్ కోసం నారాయణ్ చేసిన విజ్ఞప్తిని రత్నగిరి కోర్టు తిరస్కరించింది.